గాంధీలో సమ్మె విరమించిన వైద్యులు

31 May, 2018 16:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో వైద్యులు సమ్మె విరమించారు. వైద్య ప్రొఫెసర్ల వయోపరిమితి పెంపును వ్యతిరేకిస్తూ.. గాంధీ అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లు డాక్టర్లు ధర్నాకు దిగారు. ప్రొఫెసర్ల వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచొద్దంటూ అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఆందోళన చేపడుతున్నారు. దీంతో స్పందించిన వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి డాక్టర్లతో చర్చలు జరిపారు. వయోపరిమితి పెంపుపై ప్రభుత్వం మరోసారి ఆలోచిస్తుందని, సమ్మె విరమించాలని కోరారు. వైద్యులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి మరోసారి ప్రకటన చేస్తామని తెలిపారు.

వైద్యులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వైద్యుల సమస్యలపై పునరాలోచన చేస్తామన్న మంత్రి హామీతో వైద్యులు సమ్మె విరమించారు. ఈ సందర్బంగా డాక్టర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందన్నారు. మంత్రి హామీ ఇచ్చారని, పదవీ విరమణ వయస్సు పెంపుపై పునరాలోచన చేస్తామని భరోసా ఇవ్వడంతో విధుల్లో పాల్గొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం మాట తప్పితే మళ్ళీ సమ్మె చేస్తామని వైద్యుల వెల్లడించారు.

మరిన్ని వార్తలు