గాంధీలో కొనసాగుతున్న సమ్మె..

15 Jul, 2020 10:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి వద్ద ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. సెక్యూరిటీ, శానిటైజేషన్, ఫోర్త్ క్లాస్ పేషేంట్ కేర్ సిబ్బంది విధులు బహిష్కరించారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా నిరవధిక సమ్మెలో 600 మంది నర్సులు పాల్గొన్నారు. దీంతో కరోనా పేషెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

విధులకు హాజరు కావాలని, సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం కోరినా ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు విధుల్లో చేరమని చెబుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు