గాంధీ ఆస్ప‌త్రిలో న‌ర్సుల‌ ఆందోళ‌న విర‌మ‌ణ‌ 

15 Jul, 2020 17:26 IST|Sakshi

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌తో ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు

డిమాండ్లు నెర‌వేర్చేందుకు అంగీక‌రించిన ప్ర‌భుత్వం

సాక్షి, హైద‌రాబాద్‌: గాంధీ ఆస్ప‌త్రిలో బుధ‌వారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌తో ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ చ‌ర్చ‌లు ఓ కొలిక్కి వ‌చ్చాయి. న‌ర్సుల‌కు 17,500 నుంచి 25 వేల రూపాయ‌ల వేత‌నం ఇచ్చేందుకు ప్ర‌భుత్వం అంగీక‌రించింది. క‌రోనా డ్యూటీ చేస్తున్న వారికి డైలీ ఇన్సెంటివ్‌ల కింద రూ.750 ఇచ్చేందుకు స‌ముఖత వ్య‌క్తం చేసింది. ఉద్యోగాల‌ను అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్టులోకి మార్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని హామీ ఇచ్చింది. నాల్గ‌వ త‌ర‌గ‌తి ఉద్యోగుల‌కు రోజుకు 300 రూపాయ‌ల ఇన్సెంటివ్ ఇవ్వ‌డంతో పాటు ఇక‌పై వారికి 15 రోజులు మాత్ర‌మే డ్యూటీ ఉంటుంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఆందోళ‌న విర‌మిస్తున్న‌ట్లు న‌ర్సులు ప్ర‌క‌టించారు.  (గాంధీలో నిరవధిక సమ్మె)

చ‌దవండి: ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం

మరిన్ని వార్తలు