కపోత విలాపం

23 Jan, 2020 08:22 IST|Sakshi
గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని చెట్టు కొమ్మకు చిక్కుకున్న పావురం మాంజాతో గాలిలో వేలాడుతూ..పెద్ద కర్ర సాయంతో పావురాన్ని ప్రాణాలతో కాపాడుతున్న సిబ్బంది

పావురాన్ని కాపాడిన గాంధీ సిబ్బంది

గాంధీఆస్పత్రి: ప్రాణాపాయంలో ఉన్న రోగుల్నే కాదు మాంజాతో చిటారు కొమ్మకు చిక్కుకుని గిలగిలా కొట్టుకుంటున్న కపోతాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది. వివరాలు.. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని చెట్టు కొమ్మకు  గాలిపటం మాంజాకు చిక్కుకుని వేలాడుతున్న పావురాన్ని బుధవారం సాయంత్రం జనరల్‌ సర్జరీ వైద్యుడు శ్రీనివాసగౌడ్‌ గుర్తించారు. ప్రాణాపాయంలో అరుస్తూ మాంజాతో గాలిలో ఊగుతున్న కపోతాన్ని చూసి చలించిపోయారు. వెంటనే ఆస్పత్రి పేషీలో పనిచేసే గణేష్‌కు సమాచారం అందించారు. గణేష్‌తో పాటు ఆస్పత్రి సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ద్విచక్ర వాహనం పైకి ఎక్కి పెద్దకర్ర సాయంతో సుమారు గంట పాటు శ్రమించి కపోతాన్ని కాపాడారు. నీళ్లు తాగించారు. రెక్కకు తగిలిన స్వల్ప గాయానికి ప్రాథమిక చికిత్స చేసి వదిలిపెట్టడంతో పావురం రివ్వున ఎగిరిపోయింది. పావురం ప్రాణాలు కాపాడిన గాంధీ వైద్యులు, సిబ్బందికి ఆస్పత్రి అధికారులు అభినందించారు.

మరిన్ని వార్తలు