కాంగ్రెస్కు క్రెడిట్ దక్కుతుందనే కేసీఆర్ ఆందోళన

6 Jul, 2015 12:58 IST|Sakshi
కాంగ్రెస్కు క్రెడిట్ దక్కుతుందనే కేసీఆర్ ఆందోళన

హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపుదాల్చిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ను అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. అలాంటి ప్రాజెక్ట్ను సీఎం కేసీఆర్ పనికిరాదనడం రాజకీయ దురుద్దేశమేనని గండ్ర వ్యాఖ్యానించారు.

తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తయితే కాంగ్రెస్కు క్రెడిట్ దక్కుతుందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని గండ్ర అన్నారు. అందుకే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి కుట్రలు పన్నుతున్నారని, మహారాష్ట్ర సర్కార్ ప్రాణహిత చేవెళ్లకు గతంలోనే అంగీకరించిందని, ఇప్పుడక్కడ అధికారంలోకి వచ్చిన బీజేపీ వ్యతిరేకిస్తుందనడంతో కేసీఆర్ రాజీ పడుతున్నారని మండిపడ్డారు. తన కూతరు కవితకు కేంద్రంలో మంత్రి పదవి కోసం బీజేపీతో కేసీఆర్ సఖ్యతగా ఉంటున్నారని గండ్ర ఆరోపించారు.

మరిన్ని వార్తలు