ఐకేపీ కేంద్రాల్లో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలి

10 Nov, 2016 03:15 IST|Sakshi
ఐకేపీ కేంద్రాల్లో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి

 మిర్యాలగూడ/ నేరేడుచర్ల: ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యం మొత్తం ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా వేముల పల్లి మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొను గోలు కేంద్రాన్ని పరిశీలించి, మద్దతు ధర విష యంపై రైతులతో మాట్లాడారు. అనంతరం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో విలేకరులతో మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మిల్లర్లు తక్కువ ధర చెల్లించి దోచుకుంటున్నారని ఆరోపించారు. తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో తక్కు వ ధర చెల్లిస్తున్నారన్నారు.

మిల్లర్లు కూడా సిం డికేట్‌గా తక్కువ ధరలు చెల్లిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఐకేపీ కేంద్రాలను ఎక్కువగా ప్రారం భించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తి స్థారుు లో మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు. ఏ రోజు ధాన్యం అదేరోజు కాంటా లు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాల న్నారు. ధాన్యం విక్రరుుంచిన రైతులకు సాధ్య మైనంత త్వరగా డబ్బులు చెల్లించాలని కోరా రు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో రబీ పంటకు నీటి విడుదల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలన్నా రు. గత రెండు సంవత్సరాలుగా తీవ్ర వర్షాభా వంతో సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారని గుర్తుచేశారు. శ్రీశైలం డ్యాంలో నీరు నిల్వ ఉన్నందున విద్యుత్ ఉత్పాదన ద్వారా సాగర్‌కు విడుదల చేసి ఎడమ కాల్వ పరిధిలో రబీ పంటకు సాగునీరివ్వాలని డిమాండ్ చేశారు. నవంబర్ 15 నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకు దానిపై ఎలాంటి ప్రకటన చేయలే దన్నారు.

ప్రభుత్వం వెంటనే నీటి విడుదల తేదీలను ప్రకటించాలని తెలిపారు.  రాష్ట్రంలో వివిధ పార్టీల ఎమ్మెల్యే లు, నాయకులను చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలను పరిష్కరించడంలో టీఆర్ ఎస్‌కి లేదని విమర్శించారు. రెండున్నర సంవ త్సరాలు కావస్తున్నా పార్టీ మారిన ఎమ్మె ల్యేలపై  ఇంతవరకు ఎలాంటి స్పందనలేద న్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికా రాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఎలక్షన్ కమిషన్‌కు ఇవ్వాలని తెలి పారు. రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతి స్తోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్ రెడ్డి, సలీం తదితరులు  పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు