జీడీకే–10 గని మూసివేత

5 Apr, 2019 10:33 IST|Sakshi
 జీడీకే–10 గని 

ఓసీపీ–1కు అప్పగించిన యాజమాన్యం  

సింగరేణిలోనే మొట్టమొదటి బీజీ ప్యానల్‌ పదో గనిలోనే ఏర్పాటు

సాక్షి, రామగిరి(మంథని): సింగరేణి సంస్థలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన జీడీకే–10 గనిని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్‌లోనే 10వ గనిని మూసివేయా లని యాజమాన్యం భావించినప్పటికి అనేక కారణాల వల్ల ఆ ప్రక్రియ ఆగిపోయి.. ఈ ఏడాది మార్చి వరకు యాజమాన్యం గడువు పెంచింది. గనిలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే ముఖ్యంగా కోల్‌కట్టర్స్, సపోర్ట్‌మెన్‌లు కావల్సి ఉంటుంది. అయితే సంస్థలో కొత్తగా కార్మికుల నియామకాలు లేకపోవడంతో పాటు ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడం గని మూసివేతకు కారణంగా తెలుస్తోంది. 


520 మంది కార్మికుల బదిలీ.. 
1976లో స్థాపించిన జీడీకే–10ఇంక్లైన్‌(గని) తనకు కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తూ.. ఎంతో మందికి ఉపాధి అందించి.. బంగారు గనిగా పేరొందింది. యావత్‌ సింగరేణిలో మొట్టమొదటి బీజీ(బ్లాసింగ్‌ గ్యాలరీ)ప్యానల్‌ ఏర్పాటు చేసిన 10వ గనిలో బొగ్గు ఉత్పత్తి కోసం ఖర్చులు అధికం కావడంతో గనిని మూసివేయాలనే యాజమా న్యం నిర్ణయించింది. ఇప్పటికే గనిలో పని చేస్తున్న సుమారు సుమారు 520 మంది కార్మికులను బది లీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వారికి ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ మేరకు వీరిలో 157 మంది కార్మికులు ఆర్‌జీ3 పరిధిలోని ఓసీపీ1, ఓసీపీ 2 గనులకు బది లీ కోసం దరఖాస్తులు చేసుకున్నా రు. మిగిలిన వారు వివిధ ఏరియాలకు బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు.

గనిలో ప్రస్తుతం ఉన్న 180 మంది కార్మికులు ఉన్నారు. గని లోపల డ్యామ్‌ నిర్మాణం, యంత్రాల తరలింపునకు అవసరం మేరకు కార్మి కులను ఇక్కడే ఉంచుకుని మిగిలిన కార్మికులను వివిధ గనులకు యాజమాన్యం బదిలీ చేస్తోంది. భూగర్భంలోని నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడం కోసం 1989లో యావత్‌ సింగరేణిలోనే మొట్టమొదటి సారిగా ఈ గనిలో బీజీ ప్యానల్‌ ఏర్పాటు చేశారు. అనేక ఒడిదొడుకులను ఎదు ర్కొని నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని గని సాధించింది. ఈ క్రమంలో గనిలో వర్క్‌స్పాట్‌(పని స్థలం)దూరం పెరింగింది. దాదాపు 250 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును ఉత్పత్తి చేసేందుకు మ్యాన్‌ వైడింగ్‌ షాప్టును ఏర్పా టు చేశారు. అయితే పనిస్థలం దూరంగా ఉండటంతో ఆశించినస్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. దీంతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ గనిని ఆర్‌జీ3 పరిధి లోని ఓపీసీ1కు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించింది.

 
పెరగనున్న ఓసీపీ–1 జీవితకాలం.. 
జీడీకే–10 గనిని మూసివేసి ఆర్‌జీ –3 పరిధిలోని ఓసీపీ–1కు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించింది. దీంతో ఓసీపీ–1 జీవితకాలం దాదాపు 16 సంవత్స రాలు పెరగనుంది. ఓసీపీ–1కు అప్పగించనున్న 10వ గని ప్రాంతంలో 2019 డిసెంబర్‌ నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రా రంభం అవుతుంది. అదే విధంగా సింగరేణి సంస్థ లో మొట్టమొదటి సారి లాంగ్‌వాల్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టిన జీడీకే 10ఏ గనిని 2015లో యాజమాన్యం మూసివేసింది. జీడీకే 10ఏ గనిని 1985 లో ప్రారంభించారు. భూగర్భంలో నాలుగు పొర ల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లో పై రెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను వెలికితీయడం కోసం 1994లో 10ఏ గనిలో లాంగ్‌వాల్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. జీడికే 10, జీడీకే 10ఏ గనుల ఆవరణలో సుమారు 336 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉండగా.. 34 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. మిగిలిని 302 మిలియన్‌ టన్నుల బొగ్గును యాజమాన్యం ఓసీపీ–1 ద్వారా వెలికితీయనుంది. 

బొగ్గు ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి
జీడీకే 10వ గనిని జీవితకాలం ముగిసింది. గనిలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే కోల్‌కర్టర్స్, సపోర్టుమెన్‌ కార్మికులు అవసరం కాగా.. కొత్తగా నియాకాలు లేవు. దీనికి తోడు పని స్థలం దూరం కావడంతో బొగ్గు ఉత్పత్తికి ఖర్చులు అ«ధికం కావడం వల్ల గనిని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అయితే ఓసీపీ–1 విస్తరణ వల్ల ఏఎల్‌పీకి ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా రెండు డ్యామ్‌లను నిర్మించి, గనిలోపల ఉన్న యంత్రాలను పైకి తరలించిన తరువాతే.. గనిని పూర్తిస్థాయిలో మూసివేయడం జరుగుతుంది. 
 –బి.వీరారెడ్డి, ఏఏపీ జీఎం 

మరిన్ని వార్తలు