‘గీతం’ ఫలితాల్లో తెలంగాణ టాప్

16 May, 2015 20:42 IST|Sakshi

పటాన్‌చెరు: గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరు ప్రాంగణాలలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన గీతం ప్రవేశ పరీక్ష (గాట్-2015) ఫలితాలను శనివారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా 38 పట్టణాల్లో గత నెలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 75 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. గాట్ టాప్-10 ర్యాంకర్లలో ఐదు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులు సాధించారు. అందులో హైదరాబాద్‌లోని ఫిట్జీ జునియర్ కళాశాల విద్యార్థి వి.కె.విశ్రీత్ (269) ఐదవ ర్యాంకు, నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థి ఎస్.ఎన్. వెంకటేశ్వరన్ (268)కు 6వ ర్యాంకు, తరువాతి 7,8,10 ర్యాంకులలో హైదరాబాద్‌లోని శ్రీచైతన్య జునియర్ కళాశాల విద్యార్థులు ఎస్.సాయి శ్రావణి (265), వి.సుధాన్యూ (264), ఖమ్మం విద్యార్థి డి.సాయి వినీత్‌కుమార్ (263) మార్కులు సాధించారు. మొదటి పది ర్యాంకర్లకు తొలి ఏడాది ఫీజు మినహాయింపు, ఆ తరువాత 90 ర్యాంకర్లకు 50 శాతం రాయితీ ఉంటుందని ఆయన తెలిపారు.

జూన్ 9 నుంచి అడ్మిషన్ కౌన్సెలింగ్
పవేశ పరీక్ష రాసిన వారిలో 28 వేల మందిని మొదటి దశ కౌన్సెలింగ్ అనుమతిస్తామని వీసీ ప్రకటించారు. జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గీతం ప్రాంగణం, హైదరాబాద్ సిటీ, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు గీతం ప్రాంగణాలలో నిర్వహించనున్న ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. దీనికి సంబంధించిన సమాచారం గీతం వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు