తగ్గిన జేఈఈ అడ్వాన్స్‌డ్ కటాఫ్ మార్కులు

14 Jun, 2015 02:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహిం చిన జేఈఈ అడ్వాన్స్‌డ్ కటాఫ్ మార్కులు భారీగా తగ్గాయి. ఈ మేరకు సవరించిన కటాఫ్ మార్కుల జాబితాను ఐఐటీ బాంబే శనివారం తమ వెబ్‌సైట్‌లో పొందుపరించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విద్యార్థి అర్హతను నిర్ధారించేందుకు పరిగణనలోకి తీసుకునే కటాఫ్ మార్కులను గతంలోనే ఐఐటీ బాంబే ప్రకటించినా జవాబుల కీలపై విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తాజాగా కటాఫ్ మార్కులను తగ్గించింది.

గతంలో జనరల్‌లో విద్యార్థి 35 శాతం (177) పైగా మార్కులు సాధిస్తేనే అర్హుడని పేర్కొనగా తాజాగా వాటిని 24.5 శాతానికి (124 మార్కులు) తగ్గించింది. అలాగే ఇతర రిజర్వేషన్ కేటగిరీలవారీగా అర్హతకు పరిగణనలోకి తీసుకునే తగ్గించిన కటాఫ్ మార్కుల వివరాలను జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మొత్తం మార్కులు 504 (పేపర్-1లో 264, పేపర్-2లో 240) కాగా ప్రతిసబ్జెక్టులో 168 మార్కులు ఉంటాయి.

ప్రతి సబ్జెక్టులోని(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) పేపర్-1లో 88 మార్కులు ఉం డగా, పేపర్-2లో 80 మార్కుల చొప్పున ఉన్నాయి. మరోవైపు విద్యార్థుల అభ్యంతరాల మేరకు సవరిం చిన తాజా కీలను కూడా తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇక ఈ నెల 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ప్రకటించనుంది. వీటి ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించనుంది. ఐఐటీలవారీగా సీట్లు, రిజర్వేషన్ల వివరాలను తాజా సమాచారాన్ని వెబ్‌సైట్‌లో విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచింది.

>
మరిన్ని వార్తలు