ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్‌ పొందండిలా..

9 Oct, 2019 08:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రైలు టికెట్‌ సేవలను పొందడానికి ఇండియన్‌ రైల్వే  పలు సులభ మార్గాలను ప్రవేశపెట్టింది.  టికెట్‌ కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌ సేవలు వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. ఇండియన్‌ రైల్వే ప్రవేశపెట్టిన విధానాల్లో ఈ టికెట్‌ విధానం ఒకటి. ఈ టికెట్‌ను పొందాలంటే ఇలా చేయాలి. రైల్వే వెబ్‌సైట్‌  http://www.irctc.co.inను ఓపెన్‌ చేయండి. పేరు, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వండి. అప్లికేషన్‌లో మరోసారి పేరు, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి పూర్తి అడ్రస్‌తో సబ్‌మిట్‌ అన్న చోట క్లిక్‌ చేయండి. ‘ప్లాన్‌ మై ట్రావెల్‌ అండ్‌ టికెట్స్‌’ కాలమ్‌ను పూర్తి చేయండి. ఈ కాలమ్‌లో రైళ్లు ప్రయాణించే మార్గాలు, రైలు బెర్తు, టికెట్‌ ధర తెలుసుకుని పూర్తి చేయాలి. టికెట్‌కు సరిపడా డబ్బులు చెల్లించడానికి మేకింగ్‌ పేమెంట్‌ వద్ద క్లిక్‌ చేయాలి. మీ డెబిట్‌ కార్డు ఉన్న బ్యాంక్‌ కాలమ్‌ను క్లిక్‌ చేసి టికెట్‌ బుక్‌ చేసుకోండి. ఈ టికెట్‌ బుక్‌ చేసే వారు రూ.20 యూజర్‌ ఛార్జీ చెల్లించాలి. ఈ టికెట్‌ బుకింగ్‌కు ఫొటో గుర్తింపు కార్డు వివరాలు తప్పనిసరిగా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు