సర్పంచులూ ఏకంకండి

30 Nov, 2014 03:19 IST|Sakshi
సర్పంచులూ ఏకంకండి

ఇందూరు: పార్టీల భేదాలు లేకుండా సర్పంచుల మంతా ఏకమై సమస్యలు, డిమాండ్లను పరిష్కరించుకుందామని తెలంగాణ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సోమిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సర్పంచుల చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ‘‘సర్పంచులు ఒక కుటుంబం, ఒకే మాట, ఒకే బాణంతో ముందుకు వెళ్లాల్సి న అవసరం ఉంది. ఎన్నికలలో మనం పార్టీల పేరుతో గెలువలేదు. మనకున్న పేరుతో గెలి చాం. అందుకే మన సమస్యలను మనమే తీర్చుకోవాలి’’ అన్నారు. కష్టపడితే కాని ఏదీ సాధించలేమని, సమస్యలు తీరాలంటే ప్రభుత్వంతో పోరాడాలన్నారు. రాజ్యాంగంలోని  73,74 ఆర్టికల్ ప్రకారం సర్పంచులకు 29 అంశాలపై అధికారాలు దక్కాలన్నారు.

ఈ డిమాండ్లు తీరాలి
సర్పంచులకు రూ. 20 వేల వేతనం, ప్రమాదవశాత్తు మరణించినవారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఎమ్మెల్సీ ఎన్నికలలో సర్పంచులకు ఓటు హక్కు కల్పించడం, పె న్షన్, రేషన్ కార్డుల లభ్ధిదారుల గుర్తింపు బాధ్యత, తది    తర డిమాండ్లను సాధించుకోవడానికి ప్రభుత్వంతో నేరుగా మాట్లాడాల్సి ఉందన్నారు. ఇందుకోసం త్వరలోనే రాష్ట్రంలోని పది జిల్లా ల సర్పంచులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. మొ త్తం 2,600 మంది సర్పంచులు ఆ రోజు స   మావేశంలో పాల్గొంటారని తెలిపారు.

ప్రభుత్వం ‘మన ఊరు- మన ప్రణాళిక’ ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నామని చె ప్పారు. వీలైనంత తొందరగా గ్రామాలకు నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తే బా  గుంటుందన్నారు. గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లు బకాయిలను ప్రభుత్వమే చెల్లిం     చాలని పంచాయతీరాజ్ శాఖా మంత్రికి విన్నవించామన్నారు. ప్రధాని ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచులకు సూచించారు.

గాంధీజీ కలలుగన్నస్వరాజ్యాన్ని సాధిద్దాం
సభకు అధ్యక్షత వహించిన ఫోరం జిల్లా అధ్యక్షుడు గోర్త రాజేందర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలలుగన్న స్వరాజ్యం రావాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాల న్నారు. ప్రభుత్వం సర్పంచులకు ప్రోత్సహం అందిస్తే కలలు నిజం చేసి చూపిస్తామన్నారు. ‘జై సర్పంచ్- జై గ్రామ పంచాయతీ’ అనే నినాధంతో ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలను అరికట్టాలని, వాటితో సర్పంచులు చాలా ఇబ్బం  దులు ఎదుర్కుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర నాయకులు భూ  మన్న, ఆశోక్, రామన్న, హరికృష్ణ, చారి, జిల్లా అధికార ప్రతినిధి సంతోష్‌కుమార్, జలంధర్ వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు