ఆస్తి పన్ను సేకరణలో జీహెచ్‌ఎంసీ రికార్డు

1 Apr, 2018 12:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : 2017-18 సంవత్సరానికిగానూ ఆస్తి పన్నుల సేకరణలో జీహెచ్‌ఎంసీ రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం 2016-17లో 1205 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను వసూలు చేసిన బల్దియా 1320.26 కోట్లతో రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 115 కోట్లు అధికం.

గత ఏడాదితో పోల్చితే అడ్వర్టైజ్‌మెంట్‌ వసూళ్లలో భారీ పెరుగుదల నమోదైంది. 2016-17లో రూ. 26.19 కోట్లు వసూలు కాగా ప్రస్తుతం రూ. 38.44 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం 42 కోట్లు ఉన్న ట్రైడ్‌ లైసెన్స్‌ వసూళ్లు ప్రస్తుతం రూ. 52 కోట్లకు చేరాయి. రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను సేకరించడం పట్ల నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్డన్‌రెడ్డి అధికారులకు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు