పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

24 Apr, 2020 11:11 IST|Sakshi

మేయర్‌ బొంతు రామ్మోహన్

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచానే గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు ఎదురొడ్డి పోరాడుతున్న మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ధన్యవాదాలు తెలిపారు.  శుక్రవారం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చార్మినార్‌ వద్ద  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి పారిశుధ్య కార్మికుల చేత అధికారులు పత్రిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజీత్‌ కంపాటి పాల్గొన్నారు.
(లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తివేసేదీ చెప్పలేం)

ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ.. నగరాన్ని 20 వేలకు పైగా శానిటేషన్‌ సిబ్బంది శుభ్రం చేస్తున్నారని పేర్కొన్నారు.  ప్రజలందరూ ఇంట్లోనే ఉండండి.. నగరాన్ని మేమే శుభ్రం చేస్తామంటూ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వైద్యులతో సమానంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో అడుగుపెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారని.. పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ధైర్యంగా పనిచేస్తున్నారన్నారు. మున్సిపల్‌ శాఖ సేవలు గుర్తించి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీలో మరిన్ని మెరుగైన ప్రమాణాలు పెంచుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో పోల్చిస్తే హైదరాబాద్‌ మున్సిపాలిటీ మెరుగైన స్థానంలో ఉందన్నారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సూచించారు.
(తొలుత ఎన్నారై.. ఆ తర్వాత మర్కజ్‌ లింక్‌లే..)

మరిన్ని వార్తలు