జంక్షన్‌ ‘సుందర్‌’

11 May, 2019 08:00 IST|Sakshi

8 జంక్షన్ల సుందరీకరణ  

స్థానిక థీమ్‌లతో పనులు  

ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ

సాక్షి, సిటీబ్యూరో: ఓవైపు రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం చేపట్టిన జీహెచ్‌ఎంసీ... మరోవైపు జంక్షన్ల  సుందరీకరణ, అభివృద్ధిపై దృష్టిసారించింది. ఆయా మార్గాల్లో ప్రయాణికులకు ఆహ్లాదం కలిగించేలా, ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభించేలా రంగురంగుల పూల మొక్కలు ఏర్పాటు చేయనుంది. స్థానిక అంశాల థీమ్‌లతో ఈ పనులు చేపట్టింది. మొత్తం 8 జంక్షన్లలో సుందరీకరణ పనులు చేపట్టనుండగా... సుచిత్ర స్క్వేర్, మెట్టుగూడ, ఎల్‌బీనగర్‌ జంక్షన్లలో పనులు ప్రారంభమయ్యాయి. జూన్‌ 2న రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని... అప్పటి వరకు పనులు పూర్తి చేసి, ఆ రోజున ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. ఒక్కో జంక్షన్‌ సుందరీకరణకు దాదాపు రూ.25 లక్షల చొప్పున ఖర్చు కానుందని అంచనా. ఆయా జంక్షన్లలో స్థానిక అంశాలను ప్రతిబింబించే త్రీడీ చిత్రాల బొమ్మలు ఏర్పాటు చేయనున్నారు. 

జంక్షన్లు ఇవీ...  
సుచిత్ర స్క్వేర్, మెట్టుగూడ, ఎల్‌బీనగర్‌  లక్డీకాపూల్, ఆరాంఘర్, ఉప్పల్‌   మూసాపేట్, బుద్ధ భవన్‌ 

మరిన్ని వార్తలు