లక్కీ లక్ష

14 Aug, 2019 13:18 IST|Sakshi

మళ్లీ మస్కిటో యాప్‌ కాంటెస్ట్‌  

దోమల నివారణపై 17 ప్రశ్నలు  

సరైన సమాధానాలిస్తే బహుమతి  

లాటరీ ద్వారా 10 మంది ఎంపిక  

ఒక్కొక్కరికి రూ.10 వేలు  

16 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు  

ప్రకటించిన జీహెచ్‌ఎంసీ  

సాక్షి, సిటీబ్యూరో: దోమల వ్యాప్తి, నివారణ చర్యలకు సంబంధించి సరైన సమాధానాలు చెబితే జీహెచ్‌ఎంసీ రూ.లక్ష నగదు బహుమతులు ఇవ్వనుంది. దోమల వ్యాప్తితో కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందు కు మస్కిటో యాప్‌ ప్రవేశపెట్టిన జీహెచ్‌ఎంసీ... అందులోని 17 ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపించే వారికి బహుమతులు అందజేస్తుంది. గతంలోనూ ఈ కాంటెస్ట్‌ నిర్వహించిన బల్దియా... ప్రస్తుతం నగరంలో దోమల తీవ్రత ఎక్కువ కావడం, జ్వర బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతుండడంతో మరో సారి తెరపైకి తీసుకొచ్చింది. మొత్తం రూ.లక్ష నగదు బహుమతి అందజేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ మంగళవారం ప్రకటించారు. ఈ నెలాఖరులోగా సమాధానాలు పంపించాలన్నారు. సరైన సమాధానాలు తెలి పిన వారిలో 10 మందిని లాటరీ ద్వారా ఎంపి క చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.లక్ష అందజేస్తామన్నారు. మస్కి టో యాప్‌ను ‘మైజీహెచ్‌ఎంసీ’ యాప్‌లోనే పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మస్కిటో యాప్‌ను దాదాపు 8లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.  

ప్రత్యేక వైద్య శిబిరాలు...  
ఈ నెల 16–26 వరకు ఎంపిక చేసిన ప్రాం తాల్లో 600 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు దానకిశోర్‌ తెలిపారు. నగరంలో సీజనల్‌ వ్యాధులు, వాటి నివారణకు చేపట్టిన చర్యలపై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల వైద్యాధికారులు, మలేరియా అధికారు లు, ఎంటమాలజీ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించేందుకు ఎంటమా లజీ విభాగానికి చెందిన 650 బృందాలు ప్రజలకు అవగాహన కల్పిస్తాయన్నారు. డ్రై డేలో భాగంగా వివిధ పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, ఇళ్ల ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లలో దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు అమర్చడం, పనికిరాని వస్తువులు ఇంటి పరిసరాల్లో ఉండకుండా చేయడం తదితర చేస్తారన్నారు. ప్రతి బుధవారం జరిగే స్వయం సహా యక బృందాల సమావేశంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, ఫ్రైడే డ్రైడేగా పాటించడం, బస్తీ  దవాఖానాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. 

‘ప్రైవేట్‌’లో తనిఖీలు  
సాధారణ జ్వరంతో ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లే వారికి సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే డెంగీ సోకిందని భయబ్రాంతులకు గురిచేస్తూ చికిత్సల పేరుతో ర.లక్షల్లో వసూలు చేస్తున్నారని, ఈ మేరకు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్‌ పేర్కొన్నారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాల వైద్య శాఖ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో డెంగీ జ్వరాలకు సంబంధించి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌ వి.వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు