రోడ్డుపై నీటిని వదిలినందుకు రూ. 2లక్షల జరిమానా

4 Oct, 2019 11:39 IST|Sakshi
రోడ్డుపైకి వ్యర్థనీటిని వదిలేస్తున్న దృశ్యం

రాయదుర్గం: నగరం నుంచి గచ్చిబౌలివైపు వచ్చే ప్రధాన పాతముంబయ్‌ జాతీయ రహదారిలో రోడ్డుపైకి వ్యర్థనీటిని వదిలినందుకు రూ. 2 లక్షల జరిమానాను జీహెచ్‌ఎంసీ అధికారులు విధించారు. అధికారులు తెలిపిన మేరకు.. దాబా కూడలి నుంచి గచ్చిబౌలికి వెళ్లే రోడ్డులో పక్వాన్‌ హోటల్‌ ఎదురుగా నందన వెంచర్స్‌ సెల్లార్‌ నిర్మాణం చేస్తున్నారు. సెల్లార్‌లో పేరుకుపోయిన వ్యర్థ నీటిని పైప్‌లైన్‌ ద్వారా రోడ్డుపైకి వదిలేశారు. దీంతో రోడ్డంతా చిత్తడిగా మారి వాహనాల రాకపోకలకు ఇక్కట్లు సృష్టిస్తోంది. అసలే రోడ్డుపై ఫ్లైఓవర్‌ నిర్మాణం చేస్తుండడంతో రోడ్డంతా ఇరుకుగా మారింది. ఈనేపథ్యంలో వ్యర్థనీటిని రోడ్డుపైకి వదిలినందును సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు జీహెచ్‌ఎంçసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్డును పరిశీలించి నీటిని వదిలేసినది గమనించి నిర్మాణం చేస్తున్న నందన వెంచర్‌ సంస్థకు రెండు లక్షల రూపాయల జరిమానాను విధించారు.

మరిన్ని వార్తలు