జీహెచ్‌ఎంసీ: ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. 1610 పోస్టులు

4 Aug, 2018 15:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) సర్కిళ్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతమున్న 30 సర్కిళ్లను 48కి పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ప్రస్తుతం  ఉన్న ఆరు జోన్లను 12కు పెంచింది. గ్రేటర్‌ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

రెండు నియోజకవర్గాలకు ఒక జోన్‌ చొప్పున ఏర్పాటు చేసింది. ప్రతి జోన్‌లో నాలుగు సర్కిళ్లు ఉండనున్నాయి. స‌ర్కిళ్లు, జోన్ల పెంపుతో 1,610 అద‌న‌పు పోస్టుల మంజూరు కానున్నాయి. న‌గ‌ర వాసులకు మ‌రింత వేగ‌ంగా, స‌మ‌ర్థంగా, పార‌దర్శకంగా పౌర సేవ‌లు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జీవో నంబర్‌ 149ని మున్సిప‌ల్ ప‌రిపాల‌న న‌గ‌రాభివృద్ది శాఖ జారీచేసింది.

మరిన్ని వార్తలు