యాదాద్రికి కలిసొచ్చిన కార్తీకం

9 Dec, 2018 12:07 IST|Sakshi

 యాదాద్రికి నెలరోజుల్లో రూ.6,15,91,071 ఆదాయం

సాక్షి,యాదగిరికొండ (ఆలేరు) : యాదగిరీశుడికి కార్తీకమాసం కలిసొచ్చింది. పాతగుట్ట, ప్రధానాలయం కలిపి సత్యనారాయణస్వామి వ్రతాలు తదితర అన్ని విభాగాల ద్వారా రూ.6,15,91, 071 ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.30 లక్షల ఆదాయం అధికంగా వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.


కార్తీక మాసంలో యాదాద్రికి పెరిగిన ఆదాయం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో  ఈ ఏడాది కార్తీకమాసంలో గతంలో కంటే ఆదాయం పెరిగింది. యాదగిరిగుట్ట దేవస్థానం వ్రతాలకు పెట్టింది పేరు. యాదాద్రికి సికింద్రాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, బెంగళూరు, రాజమండ్రితోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి సైతం వచ్చి ఇక్కడ వ్రతాలను నిర్వహిస్తారు.

అందుకనే యాదాద్రి దేవస్థానం రెందో అన్నవరంగా పేరుగాంచింది. కార్తీకమాసంలో ఎక్కువగా సత్యనారాయణ వ్రతాలను చేయించుకుంటారు. ఈ ఏడాది కార్తీకమాసంలో నెలాఖరు వరకు అంటే 30 రోజులలో మొత్తం 17,921 వ్రతాలు జరిగాయి. అలాగే పాతగుట్టలో సైతం వ్రతాలు పెరిగాయి. గతేడాది 1340 కాగా ఈ యేడాది 1520 వ్రతాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

వీటిపై స్వామి వారికి పాతగుట్ట, ప్రధానాలయం కలిపి వచ్చిన ఆదాయం రూ.89,60,500 రాగా గతేడాది రూ.87,97,500 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్తీక మాసంలో అన్ని విభాగాల నుంచి ఆదాయం రూ.6,15,91,071 రాగా.. గతేడాది రూ.5,86, 69,307 వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. అంటే మొత్తంగా ఈ ఏడాది దేవస్థానానికి రూ.29,21,764 ఆదాయం పెరిగింది.  

మరిన్ని వార్తలు