బాలికలదే హవా..

19 Apr, 2019 07:50 IST|Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫలితాలలో బాలికల హవా కొనసాగింది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం  పరీక్షలకు మొత్తం 9,398 మంది విద్యార్థులు హాజరు కాగా.. 6127 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం గా 65.19 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో బాలురు 2995 మంది పరీక్షలు రాయగా 1740 మంది, బాలికలు 4370 మంది పరీక్షలకు హాజరు కాగా 2849 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ కోర్సుల్లో 873 మంది బాలురకు గాను 575 మంది, బాలికలు 1160 మందికి 963 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక మొదటి సంవత్సరంలో మొత్తం 9489 మంది విద్యార్థులు హాజరు కాగా 5859 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 61.74 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఫస్టియర్‌లో జనరల్‌ విభా గంలో బాలురు 2959 మందికి 1643 మంది ఉత్తీ ర్ణులయ్యారు. బాలికలలో 4462 మందికి 2923 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో 919 బాలురకు 490 మంది, బాలికలలో 1149 మం దికి 803 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో గత సంవత్సరం ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 70.27 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసంవత్సరం 65.19 శాతానికి తగ్గడం గమనార్హం. జిల్లాలో మొత్తం 73 కళాశాలలు ఉండగా, వీటిలో 14 ప్రభుత్వ, 9 గిరిజన సంక్షేమ, 5 సాంఘిక సంక్షేమ, 3 కస్తూర్బా, ఒక టీఎస్‌ఆర్‌జేసీ, 41 ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. అయితే కళాశాలల వారీగా ఫలితాలు ఇంకా తెలియలేదని ఇంటర్‌ నోడల్‌ అధికారి ఎస్‌డి జహీర్‌అహ్మద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు