సెలవొస్తే.. ‘సాగు’కే..! 

30 Jul, 2019 12:02 IST|Sakshi

సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : ఆ అమ్మాయికి వ్యవ‘సాయం’ అంటే మక్కువ. పేద తల్లిదండ్రులకు తనవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యను అభ్యసించే ఓ విద్యార్థిని అరక పట్టి ఇలా దున్నుతోంది. ప్రస్తుత రోజుల్లో ఏమాత్రం సమరం దొరికినా ఫేస్‌బుక్, వాటాప్స్, టిక్‌టిక్‌లతో కాలక్షేపం చేస్తున్న యువతీ యువకులకు భిన్నంగా ఈమె సాగు పనులు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అడపా ఝాన్సీ. వెంకటప్పయ్య, లక్ష్మీ దంపతుల కూతురు ఝాన్నీ స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. వారికున్న నాలుగెకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. తండ్రికి కళ్లు సరిగా కనిపించకపోవడంతో కళాశాలకు సెలవు రోజున ఝాన్సీ నాగలి పట్టి దుక్కులు దున్నడం, విత్తనాలు వేయడం, తడి పెట్టడం, ఎరువులు చల్లడం వంటి పనులు చేస్తోంది.    

మరిన్ని వార్తలు