'ప్రాణహితకు సీడబ్ల్యూసీ అనుమతి త్వరగా ఇవ్వండి'

12 Feb, 2015 04:43 IST|Sakshi

- ఉమాభారతికి ఎంపీ వినోద్ లేఖ


న్యూఢిల్లీ: బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత - చేవెళ్ల సుజల స్రవంతి పథకానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి త్వరగా వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రి ఉమాభారతిని కోరుతూ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ లేఖ రాశారు. ఆ లేఖను మంగళవారం ఇక్కడ మీడియా కు విడుదల చేశారు.

‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేం దుకు ఇప్పటికే ప్రధాని సానుకూలత వ్యక్తం చేశారు. దీనికి సీడబ్ల్యూసీ అనుమతి కోసం 2010లోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ప్రాజెక్టు సీఈ సమర్పించా రు. ‘రాష్ట్ర నీటి పారుదల శాఖలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఉన్నప్పుడు సీడబ్ల్యూసీ పాత్రను కేవలం అంతర్రాష్ట్ర వివాదాలు, హైడ్రాలజీ వంటి అంశాలకే పరిమితం కావాలని నిబంధనలు చెబుతున్నాయి. సీడబ్ల్యూసీ తన పాత్ర వరకే పరి మితమై అనుమతులు త్వరగా మంజూరు చేసేలా చైర్మన్‌కు ఆదేశాలు జారీచేయగల రు. త్వరగా అనుమతి వస్తే జాతీయ ప్రా జెక్టు హోదా ప్రకటనకు మార్గం సుగమం అవుతుంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు