ప్రజాసేవ చేయడమే లక్ష్యం.. 

24 Nov, 2018 10:32 IST|Sakshi

స్వతంత్ర అభ్యర్థి జలందర్‌రెడ్డి  

మద్దతు తెలిపిన యువకులు  

సాక్షి, మక్తల్‌: నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేయాలన్నదే తమ ధ్యేయమని ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి మాదిరెడ్డి జలందర్‌రెడ్డి అన్నారు. మాజీ జెడ్పీటీసీ అక్కల సత్యనారాయణ ఆధ్వర్యంలో  దాసర్‌పల్లి, బోందల్‌కుంట, గ్రామాలకు చెందిన పార్టీ వార్డు సభ్యుడు డైరెక్టర్లు, వివిధ నాయకులు దాదాపు 300 మంది కార్యకర్తలతో బారీగా చేరారు.

మొదటగా మాజీ జెడ్పీటీసీ అక్కల సత్యనారాయణను జలందర్‌రెడ్డి శాలువాతో ఆవ్వానించి సన్మానం చేశారు. పట్టణంలో జలందర్‌రెడ్డి ప్రచారం చేశారు.అందరూ ట్రాక్టరు గుర్తు రావడంతో అందరి అశీర్వాదమేనని అన్నారు. అనంతరం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అక్కల సత్యనారాయణ మాట్లాడారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు. తాగునీటి వసతి, రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు.

వార్డు సభ్యులు గొల్లపల్లి నారాయణ, సత్యనారాయణగౌడ్, హన్మంతు, రవికుమార్,బాలప్ప,  కట్టవెంకటేస్, యూనిష్‌ లక్ష్మారెడ్డి, రాజుల ఆశిరెడ్డి, సూర్యనారాయణ, నీలప్ప, రంజిత్‌రెడ్డి, వెంకటేష్, మల్లేష్, మామిళ్ల ఆంజనేయులు, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.  


జలంధర్‌రెడ్డికి పెరుగుతున్న ఆదరణ  
నర్వ: నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి జలంధర్‌రెడ్డికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని బంగ్ల లక్ష్మీకాంత్‌రెడ్డి అన్నారు. నర్వలో నిర్వహించిన ప్రచారంలో జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీవెంకటయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఆచారి  ఆయనకు మద్దతు తెలిపారు. రజక సంఘం మండల అధ్యక్షుడు తమ మద్దతు తెలిపారు.

రైతు నేస్తం ట్రాక్టర్‌ గుర్తు రావడంతో జలంధర్‌రెడ్డి విజయం ఖాయమన్నారు.  ఎంపీటీసీలు వెంకట్‌రెడ్డి, సంధ్య అయ్యన్న, ఆంజనేయులు, నాగిరెడ్డి, హన్మంతురెడ్డి,  కోఆప్షన్‌ సభ్యులు ఫజల్, రజక సంఘం బొజ్జన్న, యాంకి వెంకటేష్, రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 నర్వ: మద్దతును ప్రకటిస్తున్న జెడ్పీటీసీ, విశ్వభ్రాహ్మణ, రజక సంఘం నాయకులు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు