144 సబ్సిడీ గొర్రెలు పట్టివేత

16 Dec, 2017 10:38 IST|Sakshi

సాక్షి, జనగామ :  రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుబలు ఆర్ధికాభివృద్ధి సాధించేందుకు ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం పక‍్కదారిపడుతోంది. రైతులకు దక్కాల్సిన గొర్రెలను బ్రోకర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్ రోడ్డు కళింగ ధాబా వద్ద హన్మకొండ నుంచి రెండు డీసీఎం వాహనాలలో 281 గొర్రెలను హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ పరమేశ్ కాపుకాసి గొర్రెలను తరలిస్తున్నరెండు వాహనాలను పట్టకున్నారు‌. జిల్లా కేంద్రంలోని బీరప్పగడ్డ ఆలయ సమీపంలో వాటిని ఉంచారు. ఇందులో 144 సబ్సిడీ గొర్రెలు ఉన్నట్లు పశుసంవర్దక శాఖ వైద్యులు గుర్తించారు. వైద్యులు సబ్సిడీ గొర్రెలు ఉన్నట్లు నిర్దారించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు