గోదారి గంగ.. ఉరకలెత్తంగ

4 Aug, 2019 03:18 IST|Sakshi
భద్రాద్రి వద్ద నిండుకుండలా గోదావరి

ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లిలోకి వరద  

సాక్షి, హైదరాబాద్‌: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ వద్ద 4.50 లక్షల క్యూసెక్కుల మేర వరద ఉధృతి కొనసాగింది. దీంతో గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీ వద్ద సైతం స్థానిక వాగుల నుంచి నీరు వస్తుండటంతో 9 గేట్లు ఎత్తి 36 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగి జలాశయం నిండు కుండను తలపిస్తోంది.

ప్రస్తుతం మేడిగడ్డలో 4.51 టీఎంసీలు, అన్నారంలో 9.25 టీఎంసీలు, సుందిళ్లలో 6 టీఎంసీల మేర నిల్వలున్నాయి. నిర్మల్‌ జిల్లా కడెం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రానికి 51,864 క్యూసెక్కుల మేర వరద వస్తుండటంతో 4 గేట్లు తెరిచి 39,809 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి వదులుతున్నారు. కడెం నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా ప్రస్తుతం 6.23 టీఎంసీల నిల్వ ఉంది. కడెం నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. ఎల్లంపల్లిలోకి 48,861 క్యూసెక్కుల వరద వస్తుండగా, నిల్వ 20 టీఎంసీలకుగాను 13 టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీలోకి 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నీటి నిల్వ 90 టీఎంసీలకుగాను 7.3 టీఎంసీలకు చేరుకుంది.

 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం 

ఉందిలే మంచి కాలం..! 

‘షీ నీడ్‌’ మంచి ఆలోచన

మన విద్యార్థులు పదిలం

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భార్యాభర్తల వివాద కేసుల విచారణ 

60 రోజుల ప్రణాళికతో..

ఛత్తీస్‌గఢ్‌ కరెంట్‌కు బ్రేక్‌! 

భారీగా ఆహారశుద్ధి పరిశ్రమలు

‘పరపతి’ పోయింది!

దేవదాస్‌ కనకాలకు కన్నీటి వీడ్కోలు

గుత్తా సుఖేందర్‌ రెడ్డి రాజీనామా

ఈనాటి ముఖ్యాంశాలు

రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం

విద్యార్థులను సురక్షితంగా తీసుకొస్తాం

అచ్చంపేటలో కోదండరామ్‌ అరెస్టు..!

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!

మాన్‌సూన్‌ టూర్‌కు ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు

సిటీలో ఇంటర్నేషనల్‌ బీర్‌ డే

వాన నీటిని ఒడిసి పట్టేందుకు..

వాన వదలట్లే!

మహానగరంలో సాధారణం కంటే తగ్గిన వర్షపాతం

'చెట్టు పడింది..కనపడటం లేదా'

స్వీట్‌ హౌస్‌లోకి దూసుకెళ్లిన కారు

కొత్త మున్సిపాలిటీల్లో పట్టాలెక్కని పాలన

గాంధీ మనవరాలిని కలిసిన కుప్పురాం

రోడ్లపై గుంతలు పూడుస్తున్నాం

వధువుకు ఏదీ చేయూత?

నేడు సెంట్రల్‌లో ఫ్రీ షాపింగ్‌!

సానా సతీష్‌ ఈడీ కేసులో కీలక మలుపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రామ్‌ ఎనర్జీ సినిమాను నిలబెట్టింది

పెళ్లికి వేళాయె

సల్మాన్‌ బావ... కత్రినా చెల్లి!

ప్రేక్షకులు మెచ్చిందే పెద్ద సినిమా

స్క్రీన్‌పై తొలిసారి

సెప్టెంబర్‌లో స్టార్ట్‌