ఉరకలేస్తున్న గోదావరి

5 Aug, 2019 02:33 IST|Sakshi

కాళేశ్వరం/ఏటూరునాగారం/చర్ల: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగుతున్నాయి. వారం రోజులుగా తెలంగాణ, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాణహిత నదికి వరద తాకిడి పెరిగింది. ఆదివారం రాత్రి వరకు 10.7 మీటర్ల ఎత్తులో గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తూ మేడిగడ్డ వైపునకు తరలిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో 81 గేట్లు మూసివేశారు. బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఉన్నాయి. అవుట్‌ ఫ్లో 8.26 లక్షల క్యూసెక్కులుగా, ఇన్‌ఫ్లో 8.10 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీలో నీటి నిల్వ 5.98 టీఎంసీలు ఉంది. ఇక అన్నారం బ్యారేజీలో మొత్తం 66 గేట్లు ఉండగా 4 గేట్లు ఎత్తారు.

అందులో నుంచి కిందకు 18,000 క్యూసెక్కుల వరద తరలిపోతోంది. బ్యారేజీలో నిల్వ 9 టీఎంసీలు ఉంది. ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రాంతంలో గోదావరి నీటి మట్టం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న పీవీ నర్సింహారావు సుజల స్రవంతి బ్యారేజీ పనులు వారం రోజులుగా నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది. బుధవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో గోదావరికి ఎగువన ఉన్న తాలిపేరు, గుండ్లవాగు, పాలెంవాగు, చీకుపల్లివాగు, గుబ్బలమంగి తదితర వాగుల నుంచి భారీగా వరదనీరు రావడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శనివారం రాత్రి వరకు 46.30 అడుగులకు చేరగా.. అయితే ఆదివారం సాయంత్రానికి 43 అడుగులకు తగ్గింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక మిడ్‌మానేరుకు ఎత్తిపోతలు!

పోస్టుల వివరాలు సిద్ధం చేయండి

నెత్తురోడిన హైవే

కూలీ కొడుకు.. కేవీ డైరెక్టర్‌

ఈనాటి ముఖ్యాంశాలు

ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు

జెరూసలేంలో జగన్‌ను కలిసిన ఆర్మూర్‌ వాసులు 

కులగణన తప్పుల తడక

రైలు నుంచి జారిపడి జవాన్‌ మృతి 

గోదావరి వరద పోటు..

కోడిపెట్ట.. రెండు గుడ్లెట్టా? 

వైద్య సేవలో.. మెదక్‌ సెకండ్‌

'పోలీస్‌ కావాలనుకొని ఎమ్మెల్యేనయ్యాను'

వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ..

అరరే ! ప్లాన్‌ బెడిసి కొట్టిందే..

స్నేహితులున్నవారు జీవితంలో ఓడిపోరు

కలెక్టర్‌పై ట్విటర్‌లో అసభ్యకర పోస్టులు

చేప విత్తనాలు.. కోటి 

నిజామాబాద్‌ వాసికి రూ. 28.4 కోట్ల లాటరీ

కీలక సాక్ష్యం.. ‘మరణవాంగ్మూలం’

ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు

ఎంత పని చేశావు దేవుడా!

పదహారేళ్లకే నిండునూరేళ్లు.. 

ఛత్తీస్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

గోదారి గంగ.. ఉరకలెత్తంగ

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం 

ఉందిలే మంచి కాలం..! 

‘షీ నీడ్‌’ మంచి ఆలోచన

మన విద్యార్థులు పదిలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే ఈ సినిమా మొదటి విజయం

రీమేక్‌ చేయడం సులభం కాదు

ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌

ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు!

పైసా వసూల్‌ మూవీగా సూపర్‌ 30