పుణ్యప్రదం... పుష్కర తరుణం

29 Jun, 2015 08:23 IST|Sakshi
పుణ్యప్రదం... పుష్కర తరుణం

పుణ్యప్రదం... పుష్కర  తరుణం
బూర్గంపాడు: జీవనది గోదావరి పుష్కరశోభతో పరవళ్లు తొక్కుతోంది. భద్రాద్రి శ్రీరాముని పాదాలచెంత పరవశిస్తోంది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలతో గోదావరితీరం పావనమవుతుంది.  జిల్లాలో 150 కిలోమీటర్ల పొడవునా పుష్కరాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరకాలం ఎంతో పుణ్యప్రదమైనదని వేదపండితులు, అర్చకులు చెబుతున్నారు. గోదావరినదిలో పుష్కరస్నానం చేస్తే పాపాలు నశిస్తాయి. 

భద్రాచలం పరిసరాల్లోని గోదావరిలో  శ్రీరాముని ఆజ్ఞతో కోటితీర్థములు ఎప్పుడు ఆవహించి ఉంటాయి. పుష్కరాల కాలంలో మరో మూడున్నరకోట్ల తీర్థములు నదిలో ఆవాహనమౌతాయి. మొత్తంగా  భద్రాచలం పరిసరాలలోని గోదావరిలో నాలుగున్నర కోట్ల తీర్థములు పుష్కరసమయంలో ఆవాహనమై ఉంటాయి. ఎక్కడలేని గోదావరి పుష్కర వైశిష్ట్యం భద్రాచల క్షేత్రానికే దక్కుతుంది. పుష్కరాలకు భద్రాద్రి పరిసరాల్లోని గోదావరి నదిలో పుష్కరస్నానమాచరిస్తే 60 వేల సంవత్సరాలు గంగానదీ స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని అర్చకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు