పసిడి ధర పైపైకి..

8 Aug, 2019 10:47 IST|Sakshi

రికార్డు స్థాయికి ధర 10 గ్రాములు రూ.రూ.38,840

నిలకడగా వెండి ధర

సాక్షి, సిటీబ్యూరో: బంగారం ధర భగ్గుమంటోంది. గతకొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర బుధవారం గరిష్టస్థాయికి చేరింది. హైదరాబాద్‌ మహా నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల (బిస్కెట్‌ గోల్డ్‌) బంగారం ధర రూ.38,840 పలికింది. 22 క్యారెట్ల ధర రూ.35,470కు  చేరింది. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయంగా డిమాండ్‌ ఊపందుకోవడంతో పసిడి ధర జీవనకాల గరిష్టానికి చేరింది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు పతనమౌతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణమని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెండి ధర మాత్రం నిలకడగా కనిపిస్తుంది. శ్రావణ మాసం ప్రత్యేక పూజలు, ఫంక్షన్లలతో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ధరల పెరుగుదల ప్రజలకు కొంత ఇబ్బందికరమే అని చెప్పొచ్చు.

మరిన్ని వార్తలు