అందనంటున్న బంగారం

24 Feb, 2019 10:33 IST|Sakshi

నిజామాబాద్‌ కల్చరల్‌  : పసిడి, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరడగంతో బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. డిసెంబర్‌లో బంగారం తులం (10 గ్రాములు) ధర రూ. 32,400 పలుకగా కిలో వెండి ధర రూ. 38, 700 పలికింది. ఫిబ్రవరి మాఘమాసం నుంచి వెండి బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం తులం రూ. 34,800 కాగా 22 క్యారెట్ల బంగారం తుల 33వేలు పలుకుతోంది. వెండి కిలో ధర రూ. 44 వేలు ఉమ్మడి జిల్లాలో అమ్ముతున్నారు. అసలే శుభకార్యాలకు అనువైన మాసం కావడంతో వెండి, బంగారం కొనుగోలు చేయాలంటే పెరిగిన ధరలతో సామాన్యులు అందోళన చెందుతున్నారు.  

ఆందోళన కలిగిస్తోంది 
నిత్యం పెరి గి పోతున్న బంగారం ధర చూసి పేద, మధ్యతరగతి వారు షాపుల వైపు వెళ్లడానికి జంకు తున్నారు. భారీగా పెరిగిన వెం డి బంగారం ధరలు అన్ని వర్గా ల వారికి అందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ధరలను అదుపు చేయాలి. - లత, గృహిణి 

కొనుగోళ్లు తగ్గుతున్నాయి 
బంగారం, వెండి ధరలు వసంత పంచమి నుంచి భారీగా పెరగడంతో కొనుగోళ్లు తగ్గుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటి ప్రభావం పసిడి, వెండిధరలపై పడుతోంది. గత మూడు నెలల నుంచి వివాహ, శుభకార్యాలు లేకపోవటంతో కొనుగోలుదారులు ఆసక్తి కనబరచలేదు. ఇప్పుడు కొనుగోలు చేద్దామంటే ధరలు ఆకాశాన్నంటాయి. త్వరలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రానున్న మే నెలలో రూ. 36 వేలకు చేరుకునే అవకాశం ఉంది.    - ఏజీ రామస్వామి, జిల్లా వెండి,బంగారం వర్తకుల సంఘం ప్రతినిధి

మరిన్ని వార్తలు