బంగారం వర్తకుల బంద్

8 Mar, 2016 19:28 IST|Sakshi

శేరిలింగంపల్లి (హైదరాబాద్) : బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శేరిలింగంపల్లి జ్యూయెలరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం బంద్ నిర్వహించారు. కేంద్రం వైఖరికి నిరసనగా శేరిలింగంపల్లి జ్యుయెలరీ షాపులను మూసివేశారు. తారానగర్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎక్సైజ్ డ్యూటీని విధింపు నిర్ణయాన్ని ఉపసంహరించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి నూకల శ్రీనివాస్ మాట్లాడుతూ... ఎక్సైజ్ సుంకంతో జ్యూయెలరీ వ్యాపారులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారం వినియోగదారులపై పడే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని ఎత్తివేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు