గల్ఫ్‌ కార్మికులకు శుభవార్త..

1 May, 2020 02:59 IST|Sakshi

స్వదేశానికి రప్పించేందుకు భారత రాయబార కార్యాలయాల చర్యలు

మోర్తాడ్‌ (బాల్కొండ): కరోనా వైరస్‌ సృష్టించిన విపత్కర పరిస్థితుల కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోవాలనుకుంటున్న వలస కార్మికులకు కువైట్‌ మినహా అన్ని గల్ఫ్‌ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు శుభవార్తను అందించాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, ఖతర్‌ తదితర దేశాలలో కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. దీంతో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఉద్యోగాలు కోల్పోయిన వేలాదిమంది భారత కార్మికులు తమను స్వదేశానికి రప్పించేలా చూడాలని కోరడంతో గల్ఫ్‌ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాయి. ఇంటికి చేరుకోవాలనుకునే భారతీయ కార్మికులు మన విదేశాంగ శాఖ వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని రాయబార కార్యాలయాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు