మెట్రో ప్రయాణికులకు శుభవార్త

7 Jun, 2018 09:27 IST|Sakshi

మెట్రో ప్రయాణికులకు స్మార్ట్‌మొబిలిటీ 

బ్యాటరీ వాహనాలు, రీచార్జి వాహనాల సరఫరాకు అంకుర సంస్థలకు అవకాశం.. 

9న ప్రత్యేక సదస్సు.. 

సాక్షి,సిటీబ్యూరో : మెట్రోస్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులకు స్మార్ట్‌జర్నీని సాకారం చేసేందుకు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ, ఎల్‌అండ్‌టీ సంస్థలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. స్టేషన్‌ యాక్సెస్‌ అండ్‌ మొబిలిటీ(ఎస్‌టీఏఎంపీ) కార్యక్రమాన్ని ఈనెల 9న ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి వరల్డ్‌ రిసోర్స్‌ ఇన్సిట్యూట్, టయోటామొబిలిటీ ఫౌండేషన్లు సహకరిస్తున్నట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మెట్రో స్టేషన్లకు వచ్చే ప్రయాణీకులు చివరి గమ్యస్థానం చేరుకునేందుకు అవసరమైన ఎలక్ట్రికల్‌ వాహనాలను అందుబాటులో ఉంచే అంశంపై ఔత్సాహిక అంకుర పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలతో ఈ సదస్సులో చర్చించడంతోపాటు వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు.

ఈ సదస్సు ద్వారా నగరంలో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రధానంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లేవారికి మెట్రో జర్నీని సులభతరం చేయడం,స్టేషన్లకు చేరుకోవడం, తిరిగి వారి ఇళ్లకు చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈనెల 9న జరిగే  ఈ సదస్సుకు ‘ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ టు ఎన్‌హ్యాన్స్‌ అర్బన్‌మొబిలిటీ’ పే రుతో నిర్వహిస్తున్నామని కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ హాజరుకానున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు