‘ఆపన్న హస్తం అందించడం విశేషం’

31 May, 2020 17:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాచకొండ కమీషనరేట్ ఆధ్వర్యంలో గుడ్ సమారిటన్ అవార్డు వేడుక నాగోలు శుభం కన్వెన్షన్ హాలులో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో  కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సంక్షోభ సమయంలో పోలీసులకు సహకరించి పలువురికి సేవలు చేసిన వారికి అవార్డులను బహుకరించారు. పనులు లేక అవస్థలు పడుతున్న పేదవారికి నిత్యావసర వస్తువులను అందజేసిన చిలుకనగర్ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్‌కు రాచకొండ సీపీ మహేష్ భగవత్ గుడ్ సమారిటన్ అవార్డును అందజేశారు.

సీపీ మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో ఆపన్న హస్తం అందించడం విశేషమని బన్నాల ప్రవీణ్‌ను కొనియాడారు. అవార్డు అందుకున్న ప్రవీణ్  మాట్లాడుతూ..  కరోనా కష్ట కాలంలో వికలాంగులు, ఒంటరి మహిళలతో పాటు ఇతరులకు నిత్యావసర వస్తువులను అందజేసినట్లు తెలిపారు. ఇక తాను చేసిన సేవలకు గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. కోవిడ్‌-19 సమయంలో ఈ సేవా కర్యక్రమాలు చేయడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు