నిమ్స్‌లో చికిత్స అందించాలి 

4 Jul, 2020 08:23 IST|Sakshi

ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 బారిన పడ్డ వైద్యులు, సిబ్బందికి నిమ్స్‌లో మెరుగైన చికిత్స అందించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్‌ చేసింది. కరోనాపై యుద్ధం చేస్తున్న వారిలో వైద్యులు, వైద్య సిబ్బంది ముందు వరుసలో ఉన్నారని, వీరికి వైరస్‌ సోకితే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను పలుమార్లు కలవగా ఆయన సానుకూలంగా స్పందించి నిమ్స్‌లో చికిత్సకు అంగీకరించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లాలూప్రసాద్‌ రాథోడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ దీనదయాళ్, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి వెల్లడించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలను కూడా పరిశీలించి పరిష్కరించాలని కోరారు.  

మరిన్ని వార్తలు