1000 ఔట్‌.. 1334 ఇన్‌

14 Dec, 2019 03:06 IST|Sakshi

ఆర్టీసీలో సొంత బస్సులు..అద్దె బస్సుల దోబూచులాట

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో సొంత బస్సులు వేయి వరకు తగ్గిపోనుండగా, అదే సమయంలో 1,334 అద్దె బస్సులు వచ్చి చేరబోతున్నాయి. అద్దె బస్సులు పెరిగే కొద్దీ నష్టాలు ఎక్కువవుతాయన్న నిపుణుల సూచనలు కాదని, సిబ్బంది జీతాల భారం, బస్సులపై పెట్టుబడి తగ్గించుకునే క్రమంలో అద్దె బస్సుల వైపు ఆర్టీసీ చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడున్న 2,100 అద్దె బస్సులకు అదనంగా మరో నెల రోజుల్లో 1,334 వచ్చి చేరబోతున్నాయి. దీంతో మొత్తం బస్సుల్లో ఇవి 35 శాతానికి చేరనున్నాయి.

హైదరాబాద్‌లో వేయి సొంత బస్సులను తగ్గించుకునే పని ఇప్పటికే ఆర్టీసీ ప్రారంభించింది. శనివారం నుంచి ఆ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈ బస్సుల కండక్టర్లను పెరుగనున్న అద్దె బస్సులకు విని యోగించినా, డ్రైవర్లు మిగిలిపోతారు. ఇలా త్వరలో మొత్తం 5 వేల మంది సిబ్బంది అదనంగా మారనున్నారు. ప్రస్తుతం వేయి బస్సుల తొలగింపుతో 4 వేల మంది వరకు మిగిలిపోనున్నారు. వీరిని ఎక్కడెక్కడ నియమించాలన్న అంశంపై ఈడీలు, ఫైనాన్స్‌ అడ్వయిజర్‌తో కలసి ఓ కమిటీని ఎండీ సునీల్‌శర్మ ఏర్పాటు చేశారు.

17వ తేదీ వరకు నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే సరుకు రవాణా విభాగంలో అవసరమైన వారిని వినియోగించుకోవడం, తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్న సిబ్బంది స్థానంలో వీరిని వాడుకోవడం, చదువు అర్హత ఉన్న వారిని జూనియర్‌ అసిస్టెంట్లుగా, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, టికెట్‌ చెకింగ్‌ సిబ్బందిగా విధులు వేయడం... పలు అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. సమ్మె సమయం లో ఆర్టీసీ కొత్తగా అద్దె బస్సుల కోసం రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనికి సంబంధించి 1,334 అద్దె బస్సుల ను ఖరారు చేశారు. నోటిఫికేషన్‌ ఒప్పం దం ప్రకారం.. జనవరి 26 వరకు నిర్వాహకులకు గడువు ఉంది. అంటే ఈ బస్సులు దాదాపు నెల రోజుల్లో రోడ్డెక్కనున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అన్ని రంగాల్లో విఫలమైన కేసీఆర్‌: లక్ష్మణ్‌

ప్రజలకు ఒరిగిందేమీ లేదు: ఉత్తమ్‌

పౌల్ట్రీ అభివృద్ధికి ఉత్తమ పాలసీ: తలసాని

టీఆర్‌ఎస్‌లో నిరంకుశ పోకడలు: కోదండరామ్‌

బీపీ, షుగర్‌ రోగులకు ఐడీ నంబర్‌

వచ్చే ఎన్నికల్లో విజయం మనదే!

బాల నాయకుడుగా వెళ్లి.. బడానేతగా ఎదిగి

విధుల్లో చేరిన దిశ తండ్రి

కోర్టులంటే లెక్క లేదా..?

గిట్టుబాటు ధర అందేలా కృషిచేస్తా

అందుకే వస్తోంది.. ఆస్తమా..

50 శాతం పోస్టుల్లోనే పదోన్నతులు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ @ ఉ 6:10 గం.

వ్యర్థం.. కానుంది ‘అర్థం’!

23 నుంచి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌

ఆర్టీసీకి స్వర్ణయుగం

అక్బరుద్దీన్‌కు హైకోర్టు నోటీసులు

అవి అనువైన భవనాలు కావు

కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైదు

స్థానికత ఆధారంగానే విభజన జరగాలి

పొగమంచు ఉన్నా.. కూ చుక్‌చుక్‌

‘మందకృష్ణ ఏపీలో అడుగుపెడితే తరిమికొడతాం’

ఈనాటి ముఖ్యాంశాలు

అక్బరుద్దీన్‌కు హైకోర్టు నోటీసులు జారీ

అశాంతి నిలయంగా తెలంగాణ..

ఏపీ సీఎం జగన్‌కు దిశ తండ్రి కృతజ్ఞతలు

‘ఈ పోరాటం ఇక్కడితో ఆగదు’

తెలంగాణ... వెనిజులాగా మారుతుందేమో

పసుపు రైతులకు జనవరిలో శుభవార్త

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాహుబలి కంటే గొప్పగా...

ఛలో రాజమండ్రి

సిక్స్‌ ప్యాక్‌ తేజ్‌

రంగ మార్తాండలో...

ఐదు పాత్రల చుట్టూ...

రామ్‌.. రామ్‌.. హిట్‌