దివ్యాంగుల పథకాల అమలుకు కృషి 

12 Feb, 2018 15:41 IST|Sakshi
మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనీషా 

ఎదులాపురం : దివ్యాంగుల పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రంగినేని మనీషా అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్మాట్‌స్కూల్‌ ఆవరణలో నిర్వహించిన దివ్యాంగుల జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దివ్యాంగుల సంక్షేమానికి పాటు పడుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్‌ అమలుకు కృషి చేస్తుందని వివరించారు. సభాధ్యక్షులు లింగాల రాజ సమ్మయ్య మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016 అమలు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నారాయణ, జానీ, దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బావునే నగేశ్, ఆకుల సునిల్‌కుమార్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుకుమార్, సంఘ బాధ్యులు సురేశ్, ప్రమోద్‌ కుమార్, ఎండీ ఇమ్రాన్, సూర్య, మహిళా విభాగం, మధుకర్, రవీందర్, నానయ్య, సలీం, అమానుల్లఖాన్, శ్రీధర్, సంఘాల  నాయకులు  పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు