హైకోర్టుకు 183 సూపర్‌న్యూమరరీ, 267 అదనపు పోస్టులు

20 Dec, 2019 02:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర హైకోర్టు పరిధిలో 183 సూపర్‌ న్యూమరరీ, 267 పోస్టుల కల్పనకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. ఈ మేరకు కేటగిరీల వారీగా ఆయా పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సూపర్‌న్యూమరరీ పోస్టుల్లో భాగంగా జాయింట్‌ రిజిస్ట్రార్‌(1), డిప్యూటీ రిజిస్ట్రార్‌ (3), అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌(10), సెక్షన్‌ ఆఫీసర్‌ (50),జడ్జిలు, రిజిస్ట్రార్‌లకు పీఎస్‌లు(11), డిప్యూటీ సెక్షన్‌ ఆఫీసర్లు(12), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు(24), ఎగ్జామినర్‌(3), డ్రైవర్‌(30), రికార్డు అసిస్టెంట్‌(39) పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ అ య్యాయి.

ఇక అదనపు పోస్టుల విషయానికి వస్తే జిల్లా కోర్టులు, అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులు, కమిషనర్లు, ఎస్పీ కార్యాలయాలు, జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులు, అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టులు, ప్రధాన కార్యాలయంలో పనిచేసేందుకు 267 పోస్టులకు అనుమతినిచ్చింది. ఇందులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు(4), గ్రేడ్‌–1 అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (116), గ్రేడ్‌–2 అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు(39), అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (101), పరిపాలన అధికారులు (2), సూపరిండెంట్లు (2), సీనియర్‌ అసిస్టెంట్లు(3) పోస్టులు మంజూరయ్యాయి. వీటికి తోడు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కేడర్‌లో హైకోర్టులో ఒక ఓఎస్డీ పోస్టును కూడా మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ వేరొక ఉత్తర్వు జారీ చేసింది.

మరిన్ని వార్తలు