వసతి గృహాల్లో సమస్యలకు చెక్‌!

19 May, 2019 03:28 IST|Sakshi

బీసీ హాస్టళ్లు తెరిచే నాటికి పరిష్కరించేలా కార్యాచరణ

హాస్టళ్లు సందర్శించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలకు చెక్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 1 నుంచి హాస్టళ్లు పునఃప్రారంభం కానుండటం తో ఆలోపే అక్కడి సమస్యలను పరిష్కరిం చే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశా లు జారీ చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ వసతి గృహాలకు సెలవులు ఉన్నందున.. వీలైనన్ని ఎక్కువ హాస్టళ్లను సందర్శించాలని బీసీ సంక్షే మ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విజిట్‌లో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమా లు, పరిశీలన తీరును వివరించారు. సందర్శన అనంతరం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌కు నివేదికలు ఇవ్వాలని, ప్రాధా న్యతలను బట్టి నిధులు విడుదల చేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వ్యక్తిగత పరిశీలనకే ప్రాధాన్యత
బీసీ హాస్టళ్ల పరిశీలన వ్యక్తిగతంగా చేపట్టాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. తాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితరాలను పరిశీలించాలి. ప్రస్తుతం హాస్టల్‌ కొనసాగుతున్న భవనం, నిర్మాణం తీరు, కరెంటు సరఫరా, బల్బులు, కరెంటు వైరింగ్, కిటికీలు, తలుపుల పరిస్థితి, హాస్టల్‌ పరిసరాల్లో చెత్త తొలగింపు, యూనిఫాం పంపిణీ, స్టాకు, పుస్తకాలు, కాపీల పంపిణీ వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇటీవల బీసీ వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. వాటి వినియోగం, పనితీరు ఎలా ఉందనే దాన్ని పరిశీలించాలి.

రాష్ట్రవ్యాప్తంగా 700 బీసీ హాస్టళ్లలో 634 వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 362 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా.. మిగతా 272 హాస్ట ళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. హాస్టల్‌లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో రాష్ట్ర కార్యాలయం నుంచి పరిశీలించేందుకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ సౌకర్యాన్ని కల్పించారు. నిర్ణీత ప్రొఫార్మాలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వచ్చిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించి ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు చేపడుతుంది.   

మరిన్ని వార్తలు