ఆ‘పరేషాన్’..!

14 Aug, 2015 00:29 IST|Sakshi

 వనపర్తి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు, శస్త్రచికిత్సలు(సిజేరియన్) నిలిచిపోయాయి. కొన్ని ఆస్పత్రుల్లో మత్తు(అనస్తిషీయా)వైద్యులు లేకపోగా.. మరికొన్నిచోట్ల గైనకాల జిస్టులు లేరు. కాన్పుకోసం ప్రైవేట్ ఆస్పత్రుల కు వెళ్లిన పేదలకు పగలే చుక్కలు కనిపిస్తున్నా యి. సాధారణ ప్రసవమైనా సరే రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చవుతున్నాయి. జి ల్లా ఆస్పత్రిలో తప్పితే.. వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, సీహెచ్‌ఎస్ బాదేప ల్లి, షాద్‌నగర్, కల్వకుర్తి, అలంపూర్, కల్వకుర్తి, రేవల్లి ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు అస లు జరగడమే లేదు. కాన్పులు కూడా అరకొరగానే జరుగుతున్నాయి. ఏరియా ఆస్పత్రులకు పూర్తిస్థాయిలో మత్తుమందు వైద్యులు, గైనకాల జిస్టులను నియమిస్తే సమస్య కొంత తీరేది. కా నీ చాలా ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్యులు లే రు. జిల్లాలో కార్పొరేట్ తరహాలో రూపొం దించిన ఏరియా, సీహెచ్‌ఎస్ ఆస్పత్రుల్లో జిల్లా నలుమూలల నుంచి పురిటినొప్పులతో వచ్చే గర్భిణులకు సర్కారు ఆస్పత్రుల్లో సేవలు అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేలకువేలు ఖర్చుచేస్తున్నారు.
 
 పీజీ వైద్యులు వెళ్లిపోవడంతో..
 గైనకాలజిస్టులు పీజీకోర్సుల్లో భాగంగా జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రులకు ఏడాది క్రితం వచ్చారు. సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు వారిని సమన్వయం చేస్తూ వైద్యసేవలను విని యోగించుకునేవారు. శిక్షణ గైనకాలజిస్టులకు చే దోడువాదోడుగా ఉండటంతో ఆస్పత్రుల్లో ఇ తర వైద్యులు ఆపరేషన్లు కొనసాగించేవారు. ఏ డాది శిక్షణకాలం పూర్తయిన తరువాత వారు గతనెల చివరిలో వెళ్లిపోవడంతో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. గైనకాలజి స్టులు, మత్తుమందు వైద్యుల పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉండటంతో తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్ర భుత్వ ఆస్పత్రులు ఈనెల చివరివారంలో జరిగే పీజీ వైద్యుల కౌన్సెలింగ్‌పైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే పలుమార్లు డీసీహెచ్‌ఓ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల వివరాలను ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది.
 
 డిప్యూటేషన్ వైద్యులు వీరే..
 గైనకాలజిస్ట్‌లు బాదేపల్లిలో ఉమ, డీసీహెచ్‌ఓ పద్మ, కల్వకుర్తిలో సంధ్యరాణి, అచ్చంపేటలో అర్చన, చిన్నపిల్లల వైద్యులు షాద్‌నగర్ వెంకటేశ్వర్లు, వనపర్తి వినోద్‌కుమార్, జిల్లా ఆస్పత్రిలో బి.శంకర్, నాగర్‌కర్నూల్‌లో ఫిరోజోద్దీన్, వి జయ్‌కుమార్, ఘనపురంలో హర్షదుల్లా, మత్తముందు వైద్యులు షాద్‌నగర్‌లో లక్ష్మి, మహబూబ్‌నగర్  తేజస్విని, అలంపూర్‌లో రాంబాబు డిప్యూటేషన్‌లో కొనసాగుతున్నారు.
 

మరిన్ని వార్తలు