ప్రభుత్వం దృష్టికి న్యాయవాదుల సమస్యలు

1 May, 2016 04:37 IST|Sakshi
ప్రభుత్వం దృష్టికి న్యాయవాదుల సమస్యలు

ఎంపీ వినోద్‌కుమార్ ఘనంగా జిల్లా బార్
అసోసియేషన్ వార్షికోత్సవం
 

వరంగల్ లీగల్ : రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా బార్ అసోసియేషన్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా పెం డింగ్ కేసుల పరిష్కారానికి న్యాయమూర్తుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తుల నియామకం కోసం ఎంచుకు నే పద్ధతిపై పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన జా తీయ జ్యుడీషియల్  అకాడమీ యాక్ట్‌పై సుప్రీం కోర్టు తీర్పును వ్యక్తిగతంగా విభేదిస్తున్నానని అన్నారు.

న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకునే కొలీజియం ప్రక్రియ విధివిధానాలు బహిరంగపర్చాల్సిన అవసరం ఉం దన్నారు. కక్షిదారుల వేసులు బాటుకోసం చిన్న చిన్న కేసుల్లో అరెస్టులు ఉండకూడదని సదుద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్లమెంట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41(ఎ) సవరణ చేయడం జరిగిందని, అయితే పోలీసులు ఆ అవకాశాన్ని దుర్వినియోగపర్చి లంచ గొండిత నం పెంపొందటానికి కారణమవుతున్నందున తిరిగి పార్లమెంటే సవరణ చేయాల్సిన అవసరం ఉందని వినోద్‌కుమార్ అన్నారు.

 
 స్వరాష్ట్ర ఫలాలు దక్కడం లేదు...
 వీరోచిత పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ఆశించిన ఫలాలు దక్కడం లేదని, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని జడ్జి నిమ్మనారాయణ అన్నారు. న్యాయవ్యవస్థలో అంధ్ర ఆధిపత్యం ఇప్పటికీ కొనసాగుతోందని, తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటైతే ఉద్యోగాలు వస్తాయన్న న్యాయవాదుల అశ నేరవేరే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులు తమ సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు బార్ అసోసియేషన్ వార్షికోత్సవాలు అధ్యక్షుడు బైరపాక జయాకర్ అధ్యక్షతన ఘనంగా ప్రారంభమయ్యాయి. న్యాయవాదులకు  నిర్వహించిన వివిధ క్రీడా, సాంస్కృతిక  పోటీల్లో విజేత లకు బహుమతులు అందించారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం. సహోధర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టివి రమణ, ఉపాధ్యక్షుడు అల్లం నాగరాజు, సహాయ కార్యదర్శి అకుతోట అరుణ్‌ప్రసాద్, మహిళా కార్యదర్శి కవిత , కోశాధికారి లావుడ్య సిద్దునాయక్, కార్యవర్గ సభ్యులు గోపిక రాణి,  శ్రీనివాస్, చిరంజీవి, నాగరాజు, సత్యనారాయణ, ముత్యంరావు, జాఫర్ అహ్మద్, ఇతర సీనియర్ , జూనియర్ మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు