బోధనాస్పత్రుల్లో వైద్యుల వయోపరిమితి పెంపు 

14 Jun, 2019 02:10 IST|Sakshi

58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచడానికి సర్కారు సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లోని అధ్యాపకులు, అనుబంధ ఆస్పత్రిలోని వైద్యుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచాలని సర్కారు నిర్ణయించింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా 58 ఏళ్లు మాత్రమే వయో పరిమితిగా ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరి వ యోపరిమితిని 65 ఏళ్లకు పెంచాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తర్వాత దాని అమ లు ఆలస్యం కావడం, ఈలోగా ఎన్నికలకు వెళ్లడంతో వయోపరిమితి పెంపు నిలిచిపోయింది.

ఈ నేపథ్యం లో గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని వైద్యులు ఒత్తిడి చేస్తున్నారు. పైగా బోధనాస్పత్రుల్లో ఏటా రిటైరయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది 57 మంది సీనియర్‌ అధ్యాపకులు రిటైర్‌ అవుతున్నారు. అందుకు తగినట్టుగా అధ్యాపకుల భర్తీ జరగకపోవడంతో వైద్య విద్య సంకటంలో పడింది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) తనిఖీలకు వచ్చినపుడు బోధనా సిబ్బంది లేక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలలో సీట్లు కోల్పోయిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో వారికి వయోపరిమితిని 65కు పెంచాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపాయి.   

మరిన్ని వార్తలు