ప్రభుత్వ విధానాలతోనే రైతు ఆత్మహత్యలు

4 Mar, 2016 23:45 IST|Sakshi
ప్రభుత్వ విధానాలతోనే రైతు ఆత్మహత్యలు

 సీపీఐ రాష్ట్ర కార్యదర్శి   చాడ వెంకటరెడ్డి
 
హుజూరాబాద్: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలతోనే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. హుజూరాబాద్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, కరువు నివేదికకు తగ్గట్టు సాయం అందించలేదని పేర్కొన్నారు. తీవ్రకరువుతో తాగునీటి వనరులు ఎండిపోరుునా అన్నదాతలను ఆదుకోవడంలేదన్నారు. పంటల పరిహారం అం దించడంలేదని తెలిపారు.ప్రైవేట్ పెట్టుబడులు, యాంత్రీకరణలపై మాత్రమే ప్రభుత్వాలు దృష్టి సారిస్తూ రైతు సమస్యలను పరిష్కరించడం లేదన్నారు.

రాష్ట్రంలోని సన్న, చి న్నకారు రైతులకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దే శంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలకు తెలిపేందుకు అఖిల భారత రైతుసంఘం ఆధ్వర్యం లో జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని, రైతులు ఎ దుర్కొంటున్న సమస్యలపై చర్చించి ప్రభుత్వం ఒత్తిడి తీ సుకొస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాం గోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భిక్షపతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు