డిగ్రీ కాలేజీ షిఫ్టింగ్‌ అంత ఈజీ కాదు!

21 Dec, 2019 04:44 IST|Sakshi

నిబంధనల మార్పునకు ప్రభుత్వం చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: ఒక మండలం నుంచి మరో మండలానికి ప్రైవేటు డిగ్రీ కాలేజీల షిఫ్టింగ్‌ ఇకపై అంత ఈజీ కాదు. సీఎం ఆమోదంతోనే ప్రైవేటు డిగ్రీ కాలేజీలను షిఫ్ట్‌ చేసేలా నిబంధనల్లో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మార్పుతో ఉన్నత విద్యా మండలి, విద్యాశాఖ మంత్రిపై ఒత్తిళ్లు లేకుండా చూడొచ్చని భావిస్తోంది. మండల పరిధిలో ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి కాలేజీని షిఫ్ట్‌ చేసేందుకు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇస్తుండగా, ఒక మండలం నుంచి మరో మండలానికి కాలేజీని షిఫ్ట్‌ చేసేందుకు విద్యాశాఖ మంత్రి అనుమతి ఇస్తున్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు కాలేజీని షిఫ్ట్‌ చేయాలంటేనే ఫైలు సీఎంకు వెళ్లేది. కానీ ఇకపై ఆ పరిస్థితి లేకుండా నిబంధనలను మార్చే కసరత్తు మొదలైంది. జీహెచ్‌ఎంసీలో జోన్‌ను పరిగణనలోకి తీసుకోవాలా? పాత మండలాలను పరిగణనలోకి తీసుకోవాలా అన్న దాన్ని ఖరారు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది.

>
మరిన్ని వార్తలు