పంచాయతీలలో కార్మికుల భర్తీకి కసరత్తు

20 Oct, 2019 10:54 IST|Sakshi

పంచాయతీల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియామకాలు

మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం      

సాక్షి, ఆదిలాబాద్‌: ఏడాది క్రితం ప్రతీ పంచాయతీకో కార్యదర్శిని నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతీ పంచాయతీకో పారిశుధ్య కార్మికుడిని నియమించాలని నిర్ణయించింది. పల్లెలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతీ గ్రామంలో కార్మికులు తప్పనిసరని భావిస్తోంది. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా పారిశుధ్య కార్మికుల పనిని దగ్గరుండి పరిశీలించిన సర్కారు.. కార్మికుల భర్తీకి శ్రీకారం చుట్టింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న వారిని అన్ని రకాల పనులకు వినియోగిచడంతోపాటు జీతం కూడా ఎక్కువగా ఇవ్వనున్నారు.

కాగా, కార్మికులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియమించుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు ఖాళీల వివరాలను కార్యదర్శుల నుంచి సేకరిస్తున్నారు. ఏ పంచాయతీకి ఎంత మంది కావాలి.. ప్రస్తుతం ఉన్న వారి సంఖ్యతోపాటు ఆసక్తిగా ఉన్న వారి వివరాలను పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతో పాటు కొత్తగా చేరే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పుల్‌టైం వర్కర్లకు నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇవ్వాలని అధికారులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో (జీవో 51) స్పష్టం చేసింది. 

వివరాలు సేకరిస్తున్న కార్యదర్శులు
పాత గ్రామ పంచాయతీలతోపాటు కొత్త వాటిలోనూ సరిపడా కార్మికులు లేరు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతీ 500 మంది జనాభాకు ఒక స్వీపర్‌.. ఒక పంప్‌ ఆపరేటర్‌ పని చేసేవారు. గ్రామంలో 2 వేల జనాభా ఉంటే అక్కడ ఇద్దరు స్వీపర్లు, ఒక ఆపరేటర్‌ ఉండాలి. ఐదువేల జనాభా దాటిన పంచాయతీల్లో ముగ్గురు లేదా నలుగురు స్వీపర్లు పారిశుధ్య పనులు చేపట్టేవారు. ఇక మేజర్‌ గ్రామ పంచాయతీల్లో అధిక సంఖ్యలో ఉండాల్సి ఉంటుంది.

అయితే తాజాగా విడుదలైన ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారిశుధ్య కార్మికుల జనాభా ప్రతిపాదికన పంచాయతీలో ఎంత మంది కార్మికులు అవసరం.. ప్రస్తుతం రెగ్యులర్‌గా ఎంత మంది కార్మికులుగా పని చేస్తున్నారు. కార్మికులుగా పని చేసేందుకు ఎవరెవరూ ఆసక్తిగా ఉన్నారనే వివరాలతో కూడిన నివేదికలను కార్యదర్శులు సిద్ధం చేస్తున్నారు. కార్యదర్శులు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో ఎంత మంది కార్మికులను కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోనున్నారో వెల్లడి కానుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. 

జిల్లాలో మరికొందరికీ అవకాశం 
గత నెలలో పల్లెల్లో చేపట్టిన ప్రణాళిక ద్వారా పారిశుధ్య కార్మికుల సంఖ్య స్పష్టంగా తెలిసింది. గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత పనులతోపాటు ఇతర పనుల్లో కీలకంగా వ్యవహరించే కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త వారిని తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో జిల్లాలో మరికొంత మంది పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగంలోకి చేరనున్నారు. అయితే జిల్లాలోని 17 గ్రామీణ మండలాల పరిధిలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 598 మంది పారిశుధ్య కార్మికులు ప్రస్తుతం పనులు చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన వీరిని నియమించి వివిధ రకాల పనులు చేపట్టాల్సి ఉన్నా.. 500 నుంచి 2 వేల జనాభా గల గ్రామాల్లో కూడా ఒకరిద్దరితో సర్దుకుపోతున్నారే తప్పా.. కొత్త నియామకాలపై ఇంత వరకు దృష్టి సారించలేదు.

దీంతో పారిశుధ్య కార్మికులు దాదాపు సగం పంచాయతీల్లో రెగ్యులర్‌గా కొనసాగుతుండగా, మరికొన్ని జీపీల్లో రోజు వారీ కూలీగా పని చేస్తున్నారు. అయితే రోజు వారి కూలీ రూ.250 నుంచి రూ.300 చెల్లించనుండగా, రెగ్యులర్‌గా కొనసాగుతున్న వారికి ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా రూ.4 వేల నుంచి రూ.7వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కార్మికులపై దృష్టి పెట్టడంతో ఇక నుంచి అందరికీ

సమానంగా వేతనం అందనుంది.
ఆదిలాబాద్‌అర్బన్‌: ఏడాది క్రితం ప్రతీ పంచాయతీకో కార్యదర్శిని నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతీ పంచాయతీకో పారిశుధ్య కార్మికుడిని నియమించాలని నిర్ణయించింది. పల్లెలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతీ గ్రామంలో కార్మికులు తప్పనిసరని భావిస్తోంది. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా పారిశుధ్య కార్మికుల పనిని దగ్గరుండి పరిశీలించిన సర్కారు.. కార్మికుల భర్తీకి శ్రీకారం చుట్టింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న వారిని అన్ని రకాల పనులకు వినియోగిచడంతోపాటు జీతం కూడా ఎక్కువగా ఇవ్వనున్నారు.

కాగా, కార్మికులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియమించుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు ఖాళీల వివరాలను కార్యదర్శుల నుంచి సేకరిస్తున్నారు. ఏ పంచాయతీకి ఎంత మంది కావాలి.. ప్రస్తుతం ఉన్న వారి సంఖ్యతోపాటు ఆసక్తిగా ఉన్న వారి వివరాలను పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతో పాటు కొత్తగా చేరే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పుల్‌టైం వర్కర్లకు నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇవ్వాలని అధికారులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో (జీవో 51) స్పష్టం చేసింది. 

వివరాలు సేకరిస్తున్న కార్యదర్శులు
పాత గ్రామ పంచాయతీలతోపాటు కొత్త వాటిలోనూ సరిపడా కార్మికులు లేరు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతీ 500 మంది జనాభాకు ఒక స్వీపర్‌.. ఒక పంప్‌ ఆపరేటర్‌ పని చేసేవారు. గ్రామంలో 2 వేల జనాభా ఉంటే అక్కడ ఇద్దరు స్వీపర్లు, ఒక ఆపరేటర్‌ ఉండాలి. ఐదువేల జనాభా దాటిన పంచాయతీల్లో ముగ్గురు లేదా నలుగురు స్వీపర్లు పారిశుధ్య పనులు చేపట్టేవారు. ఇక మేజర్‌ గ్రామ పంచాయతీల్లో అధిక సంఖ్యలో ఉండాల్సి ఉంటుంది.

అయితే తాజాగా విడుదలైన ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారిశుధ్య కార్మికుల జనాభా ప్రతిపాదికన పంచాయతీలో ఎంత మంది కార్మికులు అవసరం.. ప్రస్తుతం రెగ్యులర్‌గా ఎంత మంది కార్మికులుగా పని చేస్తున్నారు. కార్మికులుగా పని చేసేందుకు ఎవరెవరూ ఆసక్తిగా ఉన్నారనే వివరాలతో కూడిన నివేదికలను కార్యదర్శులు సిద్ధం చేస్తున్నారు. కార్యదర్శులు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో ఎంత మంది కార్మికులను కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోనున్నారో వెల్లడి కానుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. 

జిల్లాలో మరికొందరికీ అవకాశం 
గత నెలలో పల్లెల్లో చేపట్టిన ప్రణాళిక ద్వారా పారిశుధ్య కార్మికుల సంఖ్య స్పష్టంగా తెలిసింది. గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత పనులతోపాటు ఇతర పనుల్లో కీలకంగా వ్యవహరించే కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త వారిని తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో జిల్లాలో మరికొంత మంది పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగంలోకి చేరనున్నారు. అయితే జిల్లాలోని 17 గ్రామీణ మండలాల పరిధిలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

వీటి పరిధిలో 598 మంది పారిశుధ్య కార్మికులు ప్రస్తుతం పనులు చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన వీరిని నియమించి వివిధ రకాల పనులు చేపట్టాల్సి ఉన్నా.. 500 నుంచి 2 వేల జనాభా గల గ్రామాల్లో కూడా ఒకరిద్దరితో సర్దుకుపోతున్నారే తప్పా.. కొత్త నియామకాలపై ఇంత వరకు దృష్టి సారించలేదు. దీంతో పారిశుధ్య కార్మికులు దాదాపు సగం పంచాయతీల్లో రెగ్యులర్‌గా కొనసాగుతుండగా, మరికొన్ని జీపీల్లో రోజు వారీ కూలీగా పని చేస్తున్నారు. అయితే రోజు వారి కూలీ రూ.250 నుంచి రూ.300 చెల్లించనుండగా, రెగ్యులర్‌గా కొనసాగుతున్న వారికి ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా రూ.4 వేల నుంచి రూ.7వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కార్మికులపై దృష్టి పెట్టడంతో ఇక నుంచి అందరికీ సమానంగా వేతనం అందనుంది.

ఖాళీల వివరాలు పంపించాం
గ్రామ పంచాయతీలో పని చేస్తున్న కార్మికుల సంఖ్యతోపాటు ఖాళీల వివరాలను అధికారులకు పంపించాం. కొత్తగా నియామకానికి సంబంధించిన ఆదేశాలు జిల్లా ఉన్నతాధికారుల నుంచి మాకు రాలేదు. ఆదేశాలు రాగానే కొత్త వారిని తీసుకునేందుకు చర్యలు చేపడుతాం.    
– లక్ష్మీనారాయణ, సాంగిడి పంచాయతీ కార్యదర్శి, బేల  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

16వ రోజుకు సమ్మె: బెట్టు వీడని కార్మికులు

ఫ్రెండ్స్‌ పార్టీ: నర్సంపేటలో దారుణం..

కారాగారంలో..కర్మాగారం

ఆర్టీసీ చుట్టూ..  రాజకీయం!

ఒక్క క్లిక్‌ చాలు మెకానిక్‌ మీ చెంతకు

నేరాభియోగాలున్నా పోలీస్‌ కాలేరు

కోతకైనా సిద్ధం. ..సర్కారీ ఆస్పత్రి నిషిద్ధం!

నేడు, రేపు కొన్ని చోట్ల భారీ వర్షాలు

ఆర్టిజన్లకు వేతన స్థిరీకరణ!

స్పందించకుంటే సమ్మె ఉధృతం

సమ్మె విరమిస్తేనే చర్చలు!

ఆ పోస్టులను షేర్‌ చేసినా.. తిప్పలే!

కాంగ్రెస్‌దే అధికారం

ఆర్టీసీ సమ్మె: బంద్‌ ప్రశాంతం

స్వచ్ఛ సిరిసిల్ల లక్ష్యంగా ప్రణాళికలు

బాహుబలి మూడో మోటార్‌ వెట్‌రన్‌

పద్మ ఆత్మహత్యాయత్నం

బొటానికల్‌ గార్డెన్‌కు అరుదైన గౌరవం

రూమ్‌ బాయ్‌పై సురభి హోటల్‌ యజమాని దాడి

ఈనాటి ముఖ్యాంశాలు

ఈఎస్‌ఐ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ సమ్మె: సీఎస్‌, ఆర్టీసీ ఎండీకి నోటీసులు

ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో బహిరంగ సభ

ఉత్తమ్‌కు మంత్రి జగదీష్‌ సవాల్..

ముగిసిన ప్రచారం.. 21 పోలింగ్‌

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన చూస్తున్నాం: కిషన్‌రెడ్డి

‘రేవంత్, కోమటిరెడ్డి రోడ్ల మీద పడి కొట్టుకుంటారు’

‘అందుకే కేసీఆర్‌ సభ రద్దు చేసుకున్నారు’

మంచిర్యాలలో ఎన్‌ఐఏ ఆకస్మిక సోదాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శభాష్‌ రహానే..

బిగ్‌బాస్‌: వితికా ఎలిమినేట్‌.. ఇది ఫిక్స్‌!

సెంటిమెంట్‌ను వదలని అజిత్‌

రాయ్‌లక్ష్మి కోసం ఆ ఇద్దరు

ఫలితాన్ని పట్టించుకోను

అందరూ లైక్‌ చేస్తున్న పాట