ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం

11 May, 2015 02:54 IST|Sakshi

- రేపటి నుంచి 25వరకు విలేజ్ క్యాంపెరుున్
- 25న జిలా ్లకేంద్రంలో ర్యాలీ
- విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షురాలు ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
కేయూ క్యాంపస్ :
ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై గ్రామాల్లో, బస్తీల్లో చైతన్య కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షురాలు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కె.కాత్యాయనీ విద్మహే తెలిపారు. కాకతీయ యూనివర్సిటీలోని గెస్ట్‌హౌస్‌లో విద్యాపరిక్షణ కమిటీ బాధ్యులు, వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల బాధ్యులు ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల వసతులు, సౌకర్యాలు కల్పించి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రేషనలైజేషన్ పేరుతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ పాఠశాలల ను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యపరిచేందుకు ‘గ్రామాలకు తరలండి, బస్తీలకు తరలండి’ అనే కార్యక్రమాలను విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహించబోతున్నట్లు తెలి పారు. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి తమ గ్రామాల్లోని పాఠశాలలను పరిక్షించుకోవాల్సిన బాధ్యతపై చైతన్యం కలిగిస్తామన్నారు. 12న తొలుత ఆదర్శ గ్రామం గంగదేవునిపల్లి నుంచి ఈ కార్యాక్రమం ప్రారంభిస్తామన్నారు.

ఈ నెల 25న జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.గంగాధర్, విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా సహాధ్యక్షుడు ఎం. రవీందర్, విద్యా పరిక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ టి.లింగారెడ్డి, కోకన్వీనర్ కడారి భోగేశ్వర్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర బాధ్యులు అభినవ్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యద ర్శులు పైండ్ల యాకయ్య, బి.నరసింహారావు, డీఎస్‌యూ జిల్లా కార్యదర్శి జనార్దన్, టీవీవీ జిల్లా బాధ్యులు బి.బాలరాజు, పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం సారయ్య, కేయూ అధ్యక్షుడు సూత్రపు అనిల్ మాట్లాడారు. ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు మాట్లాడుతూ విద్యాపరిక్షణ కమిటీ ఈ నెల 12నుంచి చేపట్టబోతున్న గ్రామాలకు తరలండి చైతన్య కార్యక్రమంలో తామంతా కూడా భాగస్వాములు అవుతామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు