‘పీజీ వైద్యుల ప్రభుత్వ సేవలు తప్పనిసరి కాదు’  

3 Jul, 2018 01:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పీజీ వైద్యుల తప్పనిసరి సేవలు ఇక నుంచి వారి ఇష్టానుసారానికే పరిమితం కానున్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ పలు సడలింపులతో సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తప్పనిసరి వైద్య సేవలను ఎత్తివేయాలన్న డిమాండ్‌ నేపథ్యంలో సర్కారు ఈ ఏడాది ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరి వైద్య సేవలను ఎత్తివేసినట్లయింది. దీంతో జూన్‌ 30 నుంచి తప్పనిసరి వైద్య సేవల నిలుపుదల అమల్లోకి వచ్చింది.

కాగా, రెండు మూడు నెలల్లో ఏడాది సర్వీసు పూర్తయ్యే వైద్యులు స్టైఫండ్‌ లేకుండా సేవలు చేయాలన్న నిబంధనను విధించారు. అలాగే ప్రస్తుతం పనిచేసే వారే కాకుండా భవిష్యత్‌లో ప్రభుత్వ సేవలు చేయాలనుకునేవారు సర్కారుకే కొంత సొమ్ము చెల్లించి సేవలు చేసుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇలా ఉచితంగా సేవలు చేయాలనుకునేవారికి ఎలాంటి పారితోíషికం చెల్లించబోమని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.   

మరిన్ని వార్తలు