రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

14 Sep, 2019 13:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం మండలి మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ..  విష జ్వరాలపై వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారని తెలిపారు. ఒక్కో ఆసుపత్రి మంచంపై ముగ్గురు పేషంట్లని పడుకోబెడుతున్నారని అన్నారు. ప్లేట్ లెట్స్ పడిపోవడంతో నిరుపేదలు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీలో విష జ్వరాలకు మెరుగైన చికిత్స లేదని, పేదలకు ప్రైవేట్‌లో వీటి చికిత్సకు భారం అవుతుందని అన్నారు. విష జ్వరాలపై జిల్లా కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని కోరారు.  ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వాలని, బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

విషజ్వరాలపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి
రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారావు కోరారు. శనివారం మండలి మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో వందలాది మంది రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. విష జ్వరాలు, డెంగ్యూల అంశంపై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం బాధాకరమన్నారు.

మరిన్ని వార్తలు