నిర్మాణరంగ కార్మికులకు సర్కారు చేయూత

24 Nov, 2014 23:38 IST|Sakshi

వీరు అర్హులు
 నిర్మాణ రంగంలో మట్టిపని, గుంతలు తీయటం, చదును చేయటం, ఫిట్టర్లు, తాపీ మేస్త్రీలు, తాపీ కూలీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్‌లు, మార్బుల్, గ్రానైట్, టైల్స్ మొదలగు ఫ్లోరింగ్ పనిచేయువారు
 
  పాలిషింగ్, సెంట్రింగ్, సీలింగ్ వర్క్, పెయింటింగ్, రోడ్డు నిర్మాణ కార్మికులు, సూపర్ వైజర్లు, అకౌంటెంట్స్, ఇటుకల తయారీకార్మికులు, చెరువులు, బావులు పూడిక తీయుట, తవ్వుట మొద లైన పనులు చేసే వారు
 
నమోదు ఇలా..
 90 రోజుల పాటు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసి ఉండాలి.
 దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు జిరాక్సులను జతపరిచి, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని లేబర్ కార్యాల యంలో సంబంధిత సర్కిల్ లేబర్ అసిస్టెంట్ అధికారికి అందించాలి.
 బ్యాంకులో రూ.62తో కార్మిక శాఖ పేరు మీద చలాన్ చెల్లించాలి. ఈ మొత్తం ఒక సంవత్సరానికి మాత్రమే. రెండో సంవత్సరం రెన్యువల్ కోసం రూ.12 బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లించాలి.
 
సదుపాయాలు ఇవీ..
 భవన నిర్మాణ కార్మికుడిగా నమోదు చేయించుకున్న కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా ప్రభుత్వం వారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది.
 {పమాదం వలన 50 శాతం అంగవైకల్యం కలిగితే రూ. లక్ష వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది.

 కార్మికురాలి ప్రసూతి సహాయార్థం రూ.5000, కార్మికుడు/కార్మికురాలు సాధారణంగా మరణిస్తే రూ.30 వేలు ప్రభుత్వం ద్వారా పొందవచ్చు.
 నిర్మాణ రంగంలోని వారికి జాతీయ నిర్మాణ శిక్షణ ద్వారా శిక్షణ కార్యక్రమాలను అందిస్తుంది.

మరిన్ని వార్తలు