వివాహా కార్యక్రమానికి హాజరైన గవర్నర్ దంపతులు

3 May, 2015 18:16 IST|Sakshi

రంగారెడ్డి(శామీర్‌పేట్): ‘ది హిందూ’ ఆంగ్ల దినపత్రిక హైదరాబాద్ మాజీ రెసిడెంట్ ఎడిటర్ ఎస్.నాగేశ్‌కుమార్ దంపతుల కూతురు హరిణి వివాహం శరత్‌తో ఆదివారం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలంలోని తూంకుంటలోని అలంకృతా రిసార్ట్స్‌లో జరిగింది.

ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, వల్లీశ్వర్, ఐ.వెంకట్రావ్, పలు పార్టీల ముఖ్యనేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మరిన్ని వార్తలు