గవర్నర్‌కు స్వల్ప అస్వస్థత     

20 Aug, 2019 07:08 IST|Sakshi

తల్లి పిండ ప్రదాన కార్యక్రమం కోసం గయ వెళ్లిన నరసింహన్‌

ఉపవాసం ఉండటంతో వాంతులు

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తన తల్లి పిండ ప్రదాన కార్యక్రమం కోసం భార్య విమలా నరసింహన్‌తో కలిసి ఆయన బిహార్‌లోని గయ వెళ్లారు. పిండ ప్రదాన కార్యక్రమంలో భాగంగా ఒకరోజు ముందు నుంచి కఠిన ఉపవాసం ఉన్నా రు. సోమవారం పిండ ప్రదాన కార్యక్రమంతో పాటు పలు పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా వాంతులు చేసుకున్నారు. దీంతో అధి కారులు ఆయన్ను స్థానిక మగధ్‌ వైద్య కళాశాలకు తరలించి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారు. రక్తపోటు, పల్స్‌ నార్మల్‌గా ఉండటంతో గవర్నర్‌ వ్యక్తిగత వైద్యుడ్ని సంప్రదించి డిశ్చార్జ్‌ చేసినట్టు వైద్య కళాశాల డిప్యూటీ సూపరింటెండెంట్‌ తెలిపారు. అనంతరం అక్కడి నుంచి గవర్నర్‌ దంపతులు ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సమావేశం కానున్నారు. త్వరలో కేంద్రం గవర్నర్ల సదస్సును నిర్వహించనుంది. దేశంలోనే సీనియర్‌ గవర్నర్‌ అయినందున నరసింహన్‌ సలహాలు, సూచనలు స్వీకరించేందుకు రాష్ట్రపతి ఆయన్ను ఆహ్వానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కూడా గవర్నర్‌ సమావేశమయ్యే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు