సమష్టి కృషితోనే ఆరోగ్య తెలంగాణ 

10 Dec, 2019 03:21 IST|Sakshi
యాదాద్రి: గవర్నర్‌ దంపతులకు స్వామివారి ఆశీర్వచనం చేస్తున్న అర్చకులు

రెడ్‌క్రాస్‌ సొసైటీ సమావేశంలో గవర్నర్‌ తమిళిసై

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి సమష్టిగా కృషి చేయా లని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భవ పథకాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చన్నారు. సోమవారం హన్మకొండ లో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వరంగల్‌ అర్బన్‌ శాఖ ఆధ్వర్యంలో జూనియర్, యూత్‌ రెడ్‌ క్రాస్‌ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్‌ మాట్లాడా రు. జిల్లాలో తలసేమియా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

కాగా, రూ.3.7 లక్షలతో చేపట్టనున్న భవన విస్తరణకు గవర్నర్‌ శంకు స్థాపన చేశారు. అంతకుముందు గవర్నర్‌ దంపతులు హన్మకొండలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని, ఖిలా వరంగల్‌లో కాకతీయ కట్టడాలను సందర్శించారు. సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ షోను వీక్షించారు. నీటిలో తెలియాడే ఇటుకలను పరిశీలించిన అనంతరం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌ లో రాత్రి బస చేశారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తారు.

యాదాద్రీశుడిని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై  
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని సోమవారం గవర్నర్‌ తమిళిసై కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు గవర్నర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

గాంధీలో గవర్నర్‌ తండ్రికి వైద్య పరీక్షలు 
గాంధీ ఆస్పత్రి: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తండ్రి అనంతన్‌ (86)కు సికిం ద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ రోగిలా గాంధీ ఆస్పత్రి ఈఎన్‌టీ విభాగానికి ఆయన వచ్చారు. ఈఎన్‌టీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ శోభన్‌బాబు.. వినికిడి యంత్రాన్ని అమర్చుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు